Home » Tag » Chandrabose
మెగాస్టార్ చిరంజీవి యువ దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ స్క్రిప్ట్ కి పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకకు సినీ ప్రముఖులు కె. రాఘవేంద్రరావు, ఎం ఎం కీరవాణి, సాహితీ వేత్త చంద్రబోస్, సినీమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు పాల్గొన్నారు. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాటకు ఆస్కార్ వరించిన విషయం మనకు తెలిసిందే. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా కీరవాణి, చంద్రబోస్ లను సన్మానించింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మంత్రలు శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.
ఎన్టీఆర్ కూడా వెళ్లాల్సి వున్నా.. తారకరత్న చనిపోవడంతో క్యాన్సిల్ చేసుకుని.. ఆస్కార్ వేడుకకు ఐదారు రోజుల ముందు వెళ్లాడు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగిన ఎన్టీఆర్ .. ఆస్కార్ వేడుకలో పాల్గొనడం ఎంతో సంతోషంగా వుందని... కీరవాణి, చంద్రబోస్ అవార్డు తీసుకున్న క్షణాలను ఎప్పటికీ మరిచిపోనన్నాడు.
RRR మొదటి నుంచి దానయ్యది ప్రేక్షక పాత్రే. డబ్బులు ఇవ్వడం వరకే దానయ్య. ఎక్కడ అతనికి క్రెడిట్ రానివ్వలేదు రాజమౌళి.
అందులో భీం పాత్రలో నటించిన ఎన్టీఆర్ సినిమాలో తలకు టోపీ పెట్టుకొని కనిపించాడు. అది చూసిన బండి సంజయ్... నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన కుమ్రం భీంకు టోపీ పెట్టడం ఏంటని ఫైర్ అయ్యారు.
ఈ పాటను తెరపై చూడగానే ఎందరో తెలుగు తెలియని వారు సైతం చిందులు వేశారు. కాబట్టి, పాటకు ఎంత ప్రాచుర్యం లభించిందో చెప్పక్కర్లేదు. పైగా పదాలు చిన్నగా ఉండడంతో "నాటు నాటు..." అంటూ పరభాషలవారు సైతం ఈ పాటను హమ్ చేస్తూ సాగారు.
రాజమౌళి ఒక అంతర్జాతీయ ఏజన్సీ ద్వారా ఆస్కార్ వేడుకకు హాజరుకావడానికి విస్తృతంగా ప్రయత్నిస్తున్నాడు. అలాగే ఆస్కార్ అధికారిక వేదికపై రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నాటునాటు డ్యాన్స్ చేస్తారని ప్రచారం జరగడమే తప్పా ఇప్పటివరకు అధికారికగా అనుమతి రాలేదు.