Home » Tag » Chandrayaan
భూకంపాలు భూమిపైనేనా.. చంద్రుడిపైన రావా అన్న అనుమానం చాలా మందిలో కలుగుతుంది.
చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్ కావడంతో మోదీ ఇస్రో ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ప్రయోగం విజయవంతమైన సందర్భంగా శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా కలిసి ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. మీరు చేసిన ఈ కృషికి ఇవాళ యావత్ భారతం సలాం చేస్తుందన్నారు. 140 కోట్ల భారతీయులంతా మీరు సాధించిన విజయాన్ని చూసి గర్విస్తున్నారు.
చందమామపై కాలుమోపేటందుకు ముందుగా కృషి చేసింది అగ్రరాజ్యాలే అని చెప్పాలి. అమెరికా, రష్యాలే అధికంగా ప్రయోగాలు చేశాయి. ఈ కోవలోకి భారత్ ఇప్పుడు వచ్చి చేరింది. ఈ ప్రయోగాల లక్ష్యం మాత్రం మానవులకు జీవించేందుకు మరో ఆవాసాన్ని ఏర్పాటు చేయడమే. ఈ ప్రయత్నాలు ఎప్పటికి ఫలించి అక్కడ నివసించేందుకు దోహదపడుతుందో దశాబ్ధాల కాలంగా వేచిచూడక తప్పడం లేదు.
భారతదేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్-3 జాబిల్లికి చేరువలో ఉంది. ఇప్పటి వరకూ దాదాపు 70 శాతం దూరాన్ని చేరుకుంది చంద్రయాన్-3. స్పేస్షిప్ను చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టే కీలక ఘట్టాన్ని ఇవాళ నిర్వహించబోతున్నట్టు ఇస్రో తెలిపింది.