Home » Tag » Chevireddy
తనపై నమోదు చేసిన కేసులపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పందించారు. తనపై 11 సేక్షన్లతో కేసు నమోదు చేశారనన్నారు. తన బిడ్డకు అన్యాయం జరిగిందని బిడ్డ తండ్రి కోరితే న్యాయం చేయాలని వెళ్ళానని తెలిపిన ఆయన... బిడ్డకు సరైన వైద్యం అందించాలని తిరుపతి వైద్యులను కోరానని పేర్కొన్నారు.
తనపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిన విమర్శలపై జనసేన నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఫైర్ అయ్యారు. చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఒక చోటా నాయకుడు అంటూ మండిపడ్డారు.
భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కరరెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. చంద్రగిరిలో వైసీపీ ని ఓడించేందుకు కోట్లు ఖర్చు పెట్టిన వారికే చంద్రబాబు పదవులు ఇస్తారని... 25 ఏళ్ల యువకుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ను ఓడించడానికి అన్ని పార్టీలు కృషి చేశాయన్నారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమలలో శ్రీవారి దర్శనాలపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. శ్రీ వేంకటేశ్వరుడి దర్శనానికి భక్తులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. స్వామి వారి దర్శనం, కల్యాణం, ప్రసాదాలకు అడ్డగోలుగా టిక్కెట్లు పెంచేశారు. అన్యమత ప్రచారం కూడా యధేచ్ఛగా జరిగింది. ఇప్పుడు కొత్తగా దర్శనాల స్కామ్ బయటపడింది.