Home » Tag » Chief Minister
ఆంధ్రప్రదేశ్ లో రియల్ బూమ్ పుంజుకుంటోంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో రియల్ ఎస్టేట్ లో కదలికి వచ్చింది. గత ఐదేళ్ళుగా ఎక్కడ పెట్టుబడులు పెట్టాలో అర్థం కాక చాలా మంది తమ డబ్బుల్ని బ్యాంకుల్లో ఫిక్సిడ్ డిపాజిట్ చేసుకున్నారు.
జైలులో ఉన్న కేజ్రీవాల్ రాజీనామా చేయాలని, ఆయనను పదవి నుంచి తొలగించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. అయితే, ఈ పిటిషన్‌ను జస్టిస్ మన్మోహన్, జస్టిస్ మన్మిత్ ప్రీత్‌లతో కూడిన హైకోర్టు ధర్మాసనం గురువారం కొట్టివేసింది.
పోలీసులు తన మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నారనీ.. తనకు జారీ చేసిన 41A నోటీసుల్లో, మొబైల్ సంగతి ఎందుకు వివరించలేదని ప్రశ్నించారు క్రిశాంక్. మొబైల్ ఫోన్లో పాస్వర్డ్స్ కూడా పోలీసులు బలవంతంగా ఒత్తిడి చేసి తీసుకున్నారని ఆరోపించారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలో కోలాహలంగా జరిగాయి. సీఎం పుట్టిన రోజు కావడంతో సీఎం కార్యక్రమాల సమన్వయకర్త, ఎమ్మెల్యే తలశిల రఘురాం ఆధ్వర్యంలో 600 కిలోల కేక్ ను ట్రాలీపై ఉంచి గొల్లపూడి మైలురాయి సెంటర్ నుంచి భారీ ఊరేరింపుగా పంచాయతీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. మంత్రి మేరుగ నాగార్జున, ఎమ్మెల్యే రఘురాం, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస రావు, మేయర్ రాయన భాగ్యలక్ష్మ, ఎమ్మెల్యే ఎండీ రుహుల్లా, కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు కేక్ కట్ చేసి సీఎం జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
సోమవారం జరిగిన బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో మోహన్ యాదవ్‌ను సీఎంగా ఎన్నుకున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. ఆయనతోపాటు జగదీష దేవ్డా, రాజేంద్ర శుక్లాను డిప్యూటీ సీఎంగా ఎన్నుకున్నారు. మోహన్ యాదవ్ మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లాలోని ఉజ్జయిని దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యేగా పనిచేశారు.
అవయవ దాతలకు ప్రభుత్వం లాంఛనాలతోనే అంత్యక్రియలు నిర్వహిస్తామని ప్రకటించారు తమిళనాడు సీఎం స్టాలిన్.
ఈ నది విషయంలో చైనా, భారత్ ల మధ్య తాజాగా ఉద్రిక్తత ఏర్పడింది. తమ వైపు ఉన్న బ్రహ్మపుత్ర నదిపై విద్యుత్ ఉత్పత్తి కోసం ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్ ను కడతామని చైనా అనౌన్స్ చేసింది. దీంతో ఇద్దరి మధ్య వార్ మొదలైంది.
కేరళలో ఓనం పండుగను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సాంప్రదాయ కళా, నృత్యాలను ప్రదర్శించిన అతివలు.
విజయనగరం జిల్లా, మెంటాడ, దత్తిరాజేరు మండలాల్లో 561.88ఎకరాల్లో రూ.834 కోట్లతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్, కేంద్ర విద్య మరియు నైపుణ్యాభివృద్ధిశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్. బహిరంగ సభకు హాజరైన విద్యార్థులు, ప్రజలు.
ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో గుజరాతీ యాత్రికులతో గంగోత్రి నుంచి ఉత్తరకాశి వెళ్తుండ యాత్రికుల బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి 50 మీటర్ల లోతైన లోయలోకి దూసుకెళ్లింది.