Home » Tag » CLP leader
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్కను ప్రకటిస్తారని ఆశగా ఎదురు చూశామని అంటున్నారు భట్టి సతీమణి నందిని. సీఎల్పీ లీడర్ గా రేవంత్ పేరు ప్రకటించాక.. ఒక్కసారిగా కుప్పకూలినట్టు అయిందని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. మనస్థాపంతో అక్కడ ఉండలేకపోయానని అన్నారు. భట్టిని సీఎం సీటులో చూసేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు చాలా కష్టపడ్డారని చెప్పారు నందిని.
అనుముల రేవంత్ రెడ్డి.. తెలంగాణలో పదేళ్ళుగా అధికారానికి దూరమైన కాంగ్రెస్ ను పవర్ లోకి తెచ్చిన ఘనత ఆయన సొంతం. తెలంగాణలో కాంగ్రెస్ గెలవడం.. సీఎల్పీ నేతగా ఎన్నికవడంతో.. రేవంత్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్నారు. అట్టడుగున ఉన్న పార్టీకి జీవం నింపి.. ఫైర్ రగిల్చి.. ఇప్పుడు అధికారంలోకి తీసుకొచ్చేదాకా ఆయనదే కీలకపాత్ర. అందుకే రేవంత్ సేవలను గుర్తించిన అధిష్టానం తెలంగాణ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టేందుకు అనుమతి ఇచ్చింది.
కాంగ్రెస్ శాసనసభాపక్ష (సీఎల్పీ) సమావేశం ముగిసింది. గచ్చిబౌలిలోని ఓ హోటల్లో ఆ పార్టీ ఎమ్మెల్యేలతో ఏఐసీసీ సమావేశమయ్యారు. సీఎల్పీ నేత ఎంపికకు ఎమ్మెల్యేల అభిప్రాయాలను సేకరించారు. ఏకవాక్య తీర్మానం ను ప్రవేశపెట్టిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.
తెలంగాణలో అధికారం మారింది.. బీఆర్ఎస్ నుంచి హస్తం చేతికి అధికార పగ్గాలు అందుకుంది. ఇక మిగిలున్నది.. కాంగ్రెస్ లో సీఎం ఎవరు అని.. CLP నేత ఎవరు అని కాంగ్రెస్ లో ఎవరికి మంత్రి పదవి వరస్తుంది అని.. రాష్ట్రంలో తెగ చర్చ జరుగుతుంది.