Home » Tag » CM Jagan mohan reddy
ఏపీకి మూడు రాజధానులు కాన్సెప్ట్ తో అభాసుపాలైన జగన్ సర్కార్ కి వై వి సుబ్బారెడ్డి కొత్త తలనొప్పి తెచ్చారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాదును మరికొన్నేళ్లు కొనసాగించాలని డిమాండ్ చేశారు. అంటే ఆంధ్రప్రదేశ్ కి ఇప్పుడు నాలుగు రాజధానులు అన్నమాట. ఈ మాట ఒక్కసారిగా వైసిపి వర్గాల్లో బాంబు పేల్చింది. సాధారణ జనం పగలబడి నవ్వుకుంటున్నారు. ఇక టీడీపీ (TDP) వర్గాల్లో, ఎల్లో మీడియాలో అయితే సంబరాలే సంబరాలు.
వైఎస్సార్సీపీ ప్రభుత్వం రుషికొండను ధ్వంసం చేయడంలో నిబంధనల్ని ఉల్లంఘించిందని ఐదుగురు సభ్యుల నిపుణుల బృందం నిర్ధరించిందన్నారు. వైసీపీ ప్రభుత్వం దీనిపై సమాధానం చెబుతుందా.. లేక రుషికొండ గ్రీన్ మ్యాట్‌పై 151 అడుగుల స్టిక్కర్ అంటిస్తుందా అని సెటైర్ వేస్తూ పవన్ ట్వీట్ చేశారు.
వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు మాటలతో పల్నాడు రాజకీయాలపై కొత్త చర్చ మొదలైంది. ఢీ అనే మనుషులు.. వేడి పుట్టించే పరిణామాలు.. ఫ్యాక్షన్ పాలిటిక్స్‌కు కేరాఫ్ అనిపిస్తుంటుంది పల్ననాడు. ఎప్పుడూ పగతో రగిలిపోయే ప్రత్యర్థుల వేడితో.. చలికాలంలోనూ సెగలు రేపుతుంటుందు ఇక్కడి రాజకీయం. బ్రహ్మనాయుడు, నాయకురాలు నాగమ్మ కేంద్రంగా రాజ్యం కోసం ఎన్నో కుట్రలు, కుతంత్రాలు జరిగాయ్. చరిత్రలో ప్రత్యేకంగా ఒక పేజీని లిఖించుకున్న పల్నాడు ఎప్పుడూ రాజకీయ రణరంగమే! ఇప్పటివరకు ఒక లెక్క.. ఇకపై ఒకలెక్క అనేలా ఇక్కడి రాజకీయాలు కనిపిస్తున్నాయ్. జరుగుతున్న గొడవలు.. కనిపిస్తున్న ఆందోళనలు.. వచ్చే ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయో టీజర్ చూపిస్తున్నాయ్.
కొడాలి నాని చెప్పిన లెక్క వింటే ఆశ్చర్యపోతారు.
ఎమ్మెల్సీ విజయం తరువాత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.