Home » Tag » CM KCR
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమాదానికి గురైన విషయం అందరికీ తెలిసిందే. ఫాంహౌజ్‌లో కాలుజారి పడిపోయిన ఆయనకు.. డాక్టర్లు ఆపరేషన్ చేశారు. ఎడమ తొంటికి గాయం బలంగా తగలడంతో.. హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ చేశారు. దాదాపు నాలుగు గంటలు కష్టపడి డాక్టర్ సంజయ్ టీం ఈ ఆపరేషన్ చేసింది. ఆపరేషన్ జరిగిన 24 గంటల్లోనే కేసీఆర్‌తో వాకింగ్ చేయించారు డాక్టర్లు. హెల్త్ బులెటిన్‌తో పాటు ఈ వీడియో కూడా బయటికి వచ్చింది. కానీ అంతా ఈ వీడియోను నెగటివ్‌గానే అర్థం చేసుకున్నారు. నాలుగు గంటలు ఆపరేషన్ చేశారు అంటే.. ఖచ్చితంగా మేజర్ ఆపరేషన్ అయ్యి ఉంటుంది.
క్లియర్ మెజారిటీతో తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టబోతోంది. ఆ పార్టీలో అసలు ఆట ఇప్పుడే మొదలైంది. ముఖ్యమంత్రి నేనంటే నేనని కుమ్ములాటలు స్టార్ట్ అవుతాయి. ప్రధానంగా సీఎం రేసులో రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క మాత్రమే ఉన్నారు. ఈ ఇద్దరిలో ఎవరిని అధిష్టానం సీఎంగా ఎంపిక చేస్తుందన్నది హాట్ టాపిక్ గా మారింది. కోమటి రెడ్డి, ఉత్తమ్, శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి లాంటి మిగతా లీడర్లు రేసులో లేకపోయినా.. సీఎం సీటు విషయంలో ఎవరికి సహకరిస్తారన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
తెలంగాణ వాళ్లు కేసీఆర్ ఓడిస్తే.. సీమాంధ్రులు బతికించారు. తెలంగాణ ఉద్యమం నడిచినంత కాలం.. KCR ఆంధ్ర వాళ్ళని అమ్మ నా బూతులు తిట్టేవారు.
క్లియర్ మెజారిటీతో తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టబోతోంది. ఆ పార్టీలో అసలు ఆట ఇప్పుడే మొదలైంది. ముఖ్యమంత్రి నేనంటే నేనని కుమ్ములాటలు స్టార్ట్ అవుతాయి. ప్రధానంగా సీఎం రేసులో రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క మాత్రమే ఉన్నారు. ఈ ఇద్దరిలో ఎవరిని అధిష్టానం సీఎంగా ఎంపిక చేస్తుందన్నది హాట్ టాపిక్ గా మారింది. కోమటి రెడ్డి, ఉత్తమ్, శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి లాంటి మిగతా లీడర్లు రేసులో లేకపోయినా... సీఎం సీటు విషయంలో ఎవరికి సహకరిస్తారన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
4న కేసీఆర్ కేబినెట్ భేటీ ఇదేం షాక్.. ఇంత కాన్ఫిడెన్సా..
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఓటర్ల తీర్పు బ్యాలెట్ బాక్సుల్లో భద్రంగా ఉంది. మరో కొన్ని గంటల్లో రిజల్ట్స్ రాబోతున్నాయి. హ్యాట్రిక్ కొడతాం.. మళ్లా అధికారంలోకి వస్తాం అన్న ధీమా సీఎం కేసీఆర్, కేటీఆర్ లో స్పష్టంగా కనిపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్ కే అధికారం అని చెబుతున్నా.. అవన్నీ తప్పని నిరూపిస్తామంటున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గురువారం పోలింగ్ జరుగుతున్నప్పుడే రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పోల్ మేనేజ్ మెంట్ ను తెలుసుకుంటూ కొన్ని ఈక్వేషన్లు.. మరికొన్ని లెక్కలతో హ్యాట్రిక్ పక్కా అన్న నిర్ణయానికి వచ్చేశారు. అందుకేనేమో.. ఫలితాల తెల్లారి అంటే 4నాడు మధ్యాహ్నం రెండింటికి కేబినెట్ మీట్ పెట్టారు సీఎం కేసీఆర్.
తెలంగాణలో పోలింగ్ ముగిసింది. కౌంటింగ్ కోసం అంతా ఎదురుచూస్తున్నారు. కొన్ని గంటలు.. ఇంకొన్ని గంటలు అంతే.. నెక్ట్స్ అధికారం ఎవరిది అని తెలియడానికి! ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్ దే అధికారం అంటున్నాయి. కారు పార్టీ నేతలు మాత్రం దీన్ని అంగీకరించడం లేదు. ఐనా సరే కాంగ్రెస్‌కే పట్టం అనుకుంటున్న సమయంలో.. కేసీఆర్ ఇచ్చిన ట్విస్ట్‌తో పొలిటికల్ వర్గాలకు దిమ్మతిరిగి మైండ్‌బ్లాంక్ అయినట్లు కనిపిస్తోంది.
సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాలను ప్రతిపక్షాలు సీరియస్‌గానే తీసుకున్నాయి. కేసీఆర్‌ను రెండు చోట్లా ఓడిస్తే.. బీఆర్ఎస్కు గట్టిగా చెక్ పెట్టొచ్చని నమ్ముతున్నాయి. కామారెడ్డిలో కేసీఆర్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పోటీలో ఉన్నారు. గజ్వేల్ నుంచి బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ బరిలో ఉన్నారు.
ప్రజల సంపదను 10 సంవత్సరాలుగా పందికొక్కుల్లా తిన్న బిఆర్ఎస్ ప్రభుత్వానికి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుబంధు, రుణమాఫీ ఇవ్వదనడానికి కేసీఆర్, కేటీఆర్‌కు బుద్ధి ఉండాలి. ఐదు సంవత్సరాలుగా రుణమాఫీ అమలు చేయని రైతు వ్యతిరేకి కేసీఆర్.
హ్యాట్రిక్ అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీఆర్ఎస్కు.. బీజేపీ, కాంగ్రెస్ ముచ్చెమటలు పట్టిస్తున్నాయ్. మళ్లీ తమదే అధికారం అని కేసీఆర్, కేటీఆర్, హరీష్ పైకి ధీమాగా చెప్తున్నా.. కారు పార్టీ నేతలను తెలియని టెన్షన్ మాత్రం అలానే వెంటాడుతోంది. దీనికితోడు కారుకు అనుకూల పవనాలు లేవనే సర్వే నివేదికలు మరింత టెన్షన్ పుట్టిస్తున్నాయ్. దీనికితోడు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అందించిన సర్వే రిపోర్టుతో మరింత కంగారు మొదలైనట్లు తెలుస్తోంది.