Home » Tag » collapsed buildings
ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరిగే యుద్దంలో గాజా బలైపోతుంది. ఎత్తైన భవనాలు నేలకూలాయి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు స్థానికులు. కొందరు తలదాచుకోవడానికి పక్క ప్రాంతాలకు వలస వెళ్తున్నారు.
ఎనఫ్ ఈజ్ ఎనఫ్. దేనికైనా ఓ హద్దు ఉంటుంది. యుద్ధం చేయడానికి కూడా ఓ రీతి ఉంటుంది. ఇప్పటికే చాలా డ్యామేజ్ జరిగింది. రోజురోజుకూ హమాస్ మిలిటెంట్ల అరాచకాలు హద్దుమీరుతున్నాయి. అసలు పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మొదలైంది దేనికి? ఇప్పుడు మధ్యలో చనిపోతున్నవాళ్లు ఎవరు. అమాయక ప్రజల మీద దాడులు చేస్తున్నారు ఈ హమాస్ మిలిటెంట్లు. ఆఖరికి చిన్న పిల్లలను కూడా విడిచిపెట్టడంలేదు. నిన్నటికి నిన్న 40 మంది చిన్న పిల్లల తలలు నరికారు ఈ కిరాతకులు.
ఇజ్రాయెల్, పాలస్తీనాలో యుద్దం తీవ్ర రూపం దాల్చింది. ఆధిపత్యం కోసం ఒకరికొకరు పరస్పరం బాంబుల దాడులు చేసుకుంటున్నారు. పెద్ద పెద్ద భవనాలు నేలకూలాయి. బాంబుల మోతలతో ప్రజలు భయాందోళనలో ఉన్నారు. కుటుంబ సభ్యులను కోల్పోయి శోకసంద్రంలో మునిగిపోయారు.