Home » Tag » collections
దేవర 792 కోట్ల గ్రాస్ వసూళ్లతో దూసుకెళుతోంది. ఇవాళ,రేపటి కలెక్షన్స్ కూడా కలిపితే 900 కోట్ల క్లబ్ లో దేవర గ్రాస్ కలెక్షన్స్ చేరే ఛాన్స్ ఉంది. అదే జరిగితే, దసరాకంటే ముందే శుక్రవారమే 1000 వాలాగా దేవర రికార్డు క్రియేట్ చేసినట్టౌతుంది.
రవి తేజ నటనకి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది. మంచి పాయింట్‌తో తెరకెక్కిందనే కితాబుని కూడా అందుకుంటున్న ఈగల్ మొదటి రోజు కలెక్షన్స్ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.
మూవీ విడుదలైనప్పటి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ బాగా వచ్చింది. మొదటి మూడు రోజులు కలెక్షన్లు బాగానే రాబట్టింది. కానీ వరల్డ్ కప్ మాత్రం పెద్ద షాకిచ్చింది. ఆదివారం కూడా ఈ చిత్రం మంచి కలెక్షన్లు సాధిస్తుందని మేకర్స్ భావించారు. కానీ ఆదివారం ఈ మూవీ కలెక్షన్లకు వరల్డ్ కప్ దెబ్బ పడింది.
లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో తమిళ దళపతి విజయ్ చేసిన మూవీ లియో. వరల్డ్ వైడ్ గా వచ్చిన ఈసినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చింది. అంతవరకు ఓకే కాని, విడుదలైన రెండు వారాల తర్వాత తీరిగ్గా, ఇప్పుడు ఈ మూవీ కలెక్సన్స్ మీద కామెంట్లు, ట్రోలింగ్ పెరిగాయి.ఫేక్ కలెక్సన్స్ అంటూ కామెంట్ల ఘాటుపెంచారు.
రిజల్ట్ గురించి పక్కన పెడితే.. బ్రో మూవీ క్రియేట్ చేసిన బజ్ అంతా ఇంతా కాదు. టాలీవుడ్‌కు మించి పాలిటిక్స్‌లో ఎక్కువ రచ్చ లేపిందీ మూవీ. మిగతా సినిమాల వసూళ్లను నిర్మాతలు చెప్తే.. మా హీరో సినిమా వసూళ్లను మంత్రులు చెప్తారు తెలుసా అంటూ.. జోకులు వేసుకుంటున్నారు ఫ్యాన్స్.
యూత్‌ను ఫిదా చేసిన బేబీ మూవీ మీద కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ హీరోలుగా వైష్ణవి చైతన్య హీరోయిన్గా ఈ మూవీ తెరకెక్కగా.. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. కలెక్షన్లలో భారీగా దూసుకుపోతంది.
రూ.500 నుంచి 700 కోట్ల ఖర్చుతో తెరకెక్కిన ఆదిపురుష్ టూడీ, త్రీడీ వర్షన్లో ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం విడుదల కానుంది. మొదటి 3 రోజుల్లో 200 కోట్ల నుంచి 250 కోట్ల మధ్య రాబడుతుందని 18కి పైగా టాప్ డిస్ట్రిబ్యూటర్స్ ఎనాలసిస్ ఇచ్చారు.
సూపర్ స్టార్ రజినీకాంత్ తలుచుకుంటే తమిళ నాడు సీఎం అవ్వొచ్చు. ఆనారోగ్యం రిత్యా అటు వైపు అడుగులేయటం మానేశాడు. మరి సినిమాలైనా చేస్తాడా అంటే, ఒకటికి నాలుగు చొప్పున సినిమా మీద సినిమా చేసేస్తున్నాడు రజినీ. ఇప్పుడు తన టార్గెట్ 1000 కోట్లట.
సినిమా అంటూనే మనకు గుర్తుకొచ్చే భావన వినోదం. వారం మొత్తం పనిచేసి చికాకుగా అనిపిస్తే ఈ వారంలో ఏఏ సినిమాలు కొత్తగా విడుదలయ్యాయి అని స్నేహితులను అడిగి తెలుసుకుంటాం. టైటిల్ ఆసక్తిగా అనిపిస్తే హాలుకు వెళ్ళేందుకు ప్రయత్నిస్తాం. అలాగే ఏదైనా విషయాన్ని అతిత్వరగా ప్రజల్లోకి దూసుకుపోవడానికి ఉపయోగపడే ప్రత్యేకమైన మాధ్యమం సినిమా. దీని స్థాయి పెరిగే కొద్దీ కాలవ్యవధి తగ్గుతూ వచ్చింది. ఒకప్పుడు రెండు సంవత్సరాలు నిర్విరామంగా ఆడే చిత్రాలు కాస్త 356 రోజులకు కుదించబడ్డాయి. 200రోజులు ఆడే స్థాయి నుంచి 100 రోజుల్లో బొమ్మ అదుర్స్ అనిపించుకుంది. ఇక్కడి వరకూ బాగానే ఉంది. ఇప్పుడే అసలైన నూతన ఘట్టానికి క్లాప్ కొట్టింది సినీ కళామతల్లి. 100రోజులు ఆడే బొమ్మ క్రమక్రమంగా 50రోజులు ఆడేలా రూపుదిద్దుకుంది. ఇప్పుడైతే ఏకంగా వారం నుంచి నెల రోజులు మధ్య ఆడేలా సరికొత్త వాతావరణం థియేటర్ల వద్ద ఏర్పడింది.