Home » Tag » CONGRESS
మహారాష్ట్ర, జార్ఖండ్ లో ఎన్నికల ప్రక్రియ ముగిసింది. మరో రెండ్రోజుల్లో ఫలితాలు రానున్నాయి. మహారాష్ట్రలో పార్టీల్ని చీల్చి అధికారం వెలగబెట్టిన మహాయుతి గెలుస్తుందా...? సానుభూతి మహావికాస్ అఘాడీని అధికారపీఠంపై కూర్చోబెడుతుందా...? గిరిజన కోట జార్ఖండ్ పై ఎగ్జిట్ పోల్స్ ఏమంటున్నాయి..? ఎగ్జిట్ పల్స్ రియల్ పీపుల్స్ పల్స్ ను పట్టుకోగలిగాయా...?
ఇబ్రహీంపట్నం ఎమ్యెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. ఈడీ ఇప్పుడు ఐఏఎస్ అమోయ్ కుమార్ ను విచారిస్తుందని... త్వరలో ఈడీ కేసీఆర్,కేటిఆర్ హరీష్ రావులను విచారిస్తుందని సంచలన కామెంట్స్ చేసారు.
మంగళవారం కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ సందర్బంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య డైలాగ్స్ వార్ పీక్స్ కు చేరుకుంది. బీఆర్ఎస్ నేతల విమర్శలపై వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు. వీళ్ళకు సిగ్గు శరం లేదు అంటూ మండిపడ్డారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెట్ కల్లకుంట్ల తారక రామారావు చుట్టూ...ఉచ్చు బిగుస్తోందా ? వరుస కేసులతో కేటీఆర్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోందా ? మాజీ మంత్రికి నిద్ర లేకుండా చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యూహాలు పన్నుతోందా ?
వైసీపీ బడ్జెట్ సమావేశాలకు హాజరు కాకపోవడం పట్ల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లుంది YCP అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి తీరని ఆమె ఎక్స్ లో పోస్ట్ చేసారు.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ నాశనం అయిపోయిందని బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుండెలు బాధ కుంటున్నాడు. జనం దగ్గర వ్యాపారుల దగ్గర ఒక్క రూపాయి కనిపించడం లేదని... రియల్ ఎస్టేట్ పడిపోవడం వల్లే మిగతా అన్ని వ్యవస్థలను నాశనం అయిపోయాయని చెప్పిందే పదిసార్లు చెప్పుకొని తిరుగుతున్నాడు కేటీఆర్.
ఆటోడ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుందని ఎన్నడూ అనుకొలే అంటూ ఆవేదన వ్యక్తం చేసారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్.
హెచ్ఎండీఏ పరిధిలోని జీపీ లే అవుట్లలో రిజిస్ట్రేషన్లు బంద్ పెట్టటం మూర్ఖపు చర్య అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ మండిపడ్డారు. హైడ్రా, మూసీ పేరుతో పేదల ఇళ్లను కూలగొట్టింది చాలాదా? ఇప్పుడు వాళ్లకు ప్లాట్లు కూడా లేకుండా చేస్తారా? అని నిలదీశారు.
తాను వదిలిన బాణం తనకే తిరిగి గుచ్చుకోవడం వైసీపీ అధినేత జగన్ కు దిమ్మ తిరిగిపోయేలా చేస్తోంది. తెలంగాణాకు పరిమితం అనుకున్న చెల్లెలు పీసీసి చీఫ్ గా ఏపీలో అడుగుపెట్టడం వైఎస్ జగన్ గొంతులో వెలక్కాయ పడ్డట్టు అయింది.
హర్యానాలో కాంగ్రెస్ను కాంగ్రెస్సే ఓడించిందా...? చేతికి అంది వచ్చిన అవకాశాన్ని హస్తం ఎందుకు చేజార్చుకుంది...? అతివిశ్వాసమే కాంగ్రెస్ను ముంచిందా...? కాంగ్రెస్ నేతల తీరు ఇలాగే ఉంటే రాహుల్ ప్రధాని కావాలన్న ఆశ ఆకాంక్ష ఫలిస్తుందా...? ఇలాగైతే బీజేపీని ఎదుర్కోవడం కాంగ్రెస్ వల్లవుతుందా....?