Home » Tag » Congress CM
సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. రెండు రోజులపాటు ఆయన అక్కడే పర్యటించనున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కానున్నట్లు సమాచారం..
అనుముల రేవంత్ రెడ్డి.. తెలంగాణలో పదేళ్ళుగా అధికారానికి దూరమైన కాంగ్రెస్ ను పవర్ లోకి తెచ్చిన ఘనత ఆయన సొంతం. తెలంగాణలో కాంగ్రెస్ గెలవడం.. సీఎల్పీ నేతగా ఎన్నికవడంతో.. రేవంత్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్నారు. అట్టడుగున ఉన్న పార్టీకి జీవం నింపి.. ఫైర్ రగిల్చి.. ఇప్పుడు అధికారంలోకి తీసుకొచ్చేదాకా ఆయనదే కీలకపాత్ర. అందుకే రేవంత్ సేవలను గుర్తించిన అధిష్టానం తెలంగాణ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టేందుకు అనుమతి ఇచ్చింది.
TPCC అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డిని తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడానికి బలమైన కారణాలు ఉన్నాయి. పదేళ్ళుగా నిస్తేజంగా ఉన్న కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడంలో రేవంత్ ప్రయత్నాన్ని హైకమాండ్ గుర్తించింది. పైగా వచ్చే ఏడాదిలో జరిగే లోక్ సభ ఎన్నికల్లో ఆర్థికంగా.. పార్టీ పరంగా ముందుకు తీసుకెళ్ళే సత్తా... రేవంత్ కే ఉన్నట్టు గుర్తించింది. అందుకే రాహుల్ గాంధీ ఆయన పేరునే సూచించినట్టు తెలుస్తోంది.
తెలంగాణ నూతన సీఎం ఎంపికపై ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే మంగళవారం ఉదయం కీలక ప్రకటన చేశారు. ఈరోజే సీఎం అభ్యర్థిని ఖరారు చేస్తామని, సాయంత్రం లోపు సీఎం అభ్యర్థి పేరు ప్రకటిస్తామని ఖర్గే క్లారిటీ ఇచ్చారు. తెలంగాణకు పంపిన పార్టీ పరిశీలకుల నివేదికను పరిశీలించి.. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా పార్టీలో పలువురు సీనియర్ నేతలతో చర్చించిన అనంతరం సీఎం పేరును ప్రకటిస్తామని చెప్పారు.
తెలంగాణలో అధికారం మారింది.. బీఆర్ఎస్ నుంచి హస్తం చేతికి అధికార పగ్గాలు అందుకుంది. ఇక మిగిలున్నది.. కాంగ్రెస్ లో సీఎం ఎవరు అని.. CLP నేత ఎవరు అని కాంగ్రెస్ లో ఎవరికి మంత్రి పదవి వరస్తుంది అని.. రాష్ట్రంలో తెగ చర్చ జరుగుతుంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. కొన్నిగంటల్లో ఫలితాలు రాబోతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్ వైపే చూపిస్తున్నాయి. బీఆర్ఎస్ కు మూడోసారి అధికారం దక్కక పోవచ్చని సర్వేలు చెబుతున్నాయి. ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే.. నెక్ట్స్ తెలంగాణ సీఎం ఎవరవుతారు.