Home » Tag » congress victory
తెలంగాణ ఓటర్ నిర్ణయం.. రాజకీయాలను షేక్ చేస్తోంది. అద్భుతమైన మెజారిటీతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రేవంత్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. మంత్రివర్గంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయ్. ఐతే దీనిపై కూడా దాదాపు ఓ క్లారిటీ వచ్చేసినట్లు తెలుస్తోంది. డిప్యూటీ సీఎం విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. కాంగ్రెస్ సంగతి ఎలా ఉన్నా.. ఇప్పుడు బీఆర్ఎస్ తరఫున ప్రతిపక్ష నేతగా ఎవరు ఉంటారనేది ఆసక్తికరంగా మారింది.
క్లియర్ మెజారిటీతో తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టబోతోంది. ఆ పార్టీలో అసలు ఆట ఇప్పుడే మొదలైంది. ముఖ్యమంత్రి నేనంటే నేనని కుమ్ములాటలు స్టార్ట్ అవుతాయి. ప్రధానంగా సీఎం రేసులో రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క మాత్రమే ఉన్నారు. ఈ ఇద్దరిలో ఎవరిని అధిష్టానం సీఎంగా ఎంపిక చేస్తుందన్నది హాట్ టాపిక్ గా మారింది. కోమటి రెడ్డి, ఉత్తమ్, శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి లాంటి మిగతా లీడర్లు రేసులో లేకపోయినా.. సీఎం సీటు విషయంలో ఎవరికి సహకరిస్తారన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
ఎవరు గెలుస్తారు.. ఎన్ని సీట్లు తెచ్చుకుంటారు.. ఎంత తేడాతో గెలుస్తారు.. ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరికింది. మహా సస్పెన్స్‌కు ఫుల్స్పాట్ పడింది. హస్తం చేతుల్లోకి తెలంగాణ వెళ్లిపోయింది.
ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్..! అన్న మాట ఫలించింది. కాంగ్రెస్ ను తెలంగాణలో విజయ తీరాలకు చేర్చింది. సర్వేలు అనుకూలంగా వచ్చినా.. లోలోన మాత్రం భయం వెంటాడి చెయ్యి వణికింది. ఎందుకంటే గతంలో కూడా అలాగే జరిగింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారయ్యాయి.
ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్..! అన్న మాట ఫలించింది. కాంగ్రెస్ ను తెలంగాణలో విజయ తీరాలకు చేర్చింది. సర్వేలు అనుకూలంగా వచ్చినా.. లోలోన మాత్రం భయం వెంటాడి చెయ్యి వణికింది. ఎందుకంటే గతంలో కూడా అలాగే జరిగింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారయ్యాయి. కానీ ఈసారి మాత్రం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలిచి చరిత్ర సృష్టించింది కాంగ్రెస్.
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పనైపోయిందనుకుంటున్న సమయంలో కర్నాటకలో విజయం ఆ పార్టీకి నైతికంగా ఎంతో బలాన్నిచ్చినట్టయింది. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు, ఈ ఏడాదిలో జరగే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కర్నాటక విజయం కచ్చితంగా బాటలు పరుస్తుంది.