Home » Tag » congress win
కర్నె శిరీష.. అలియాస్ బర్రెలక్క .. తెలంగాణ ఎన్నికల్లో సెంటరాఫ్ అట్రాక్షన్ గా మారింది. కొల్లాపూర్ నుంచి పోటీ చేసిన ఆమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఆమె గెలవాలని చాలామంది కోరుకున్నారు. జేడీ లక్ష్మీనారాయణ లాంటి ప్రముఖులు బర్రెలక్కకు ఆర్థిక సాయం చేశారు. ఈ ఎన్నికల్లో ఆమెకు 5 వేల 754 ఓట్లు దక్కాయి. ఈ ఎన్నికల్లో ఓడిపోయి.. నాలుగో స్థానంలో నిలిచినా.. మనసులు గెలుచుకున్నావంటూ నెటిజెన్లు ప్రశంసిస్తున్నారు. నిరుద్యోగుల వాయిస్ వినిపించడానికి 2024లో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తానంటోంది బర్రెలక్క.
తెలంగాణ రిజల్ట్ డిసైడ్ అయ్యింది. ఆఖరికి ఎగ్జిట్ పోల్సే నిజమయ్యాయి. భారీ ఆధిక్యంతో దిశగా కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోంది. ఇప్పుడు కాంగ్రెస్‌ను బీట్ చేయడం కాదు కదా రీచ్ అవ్వడం కూడా బీఆర్ఎస్ పార్టీకి కష్టంగానే మారింది. నిజానికి ఉదయం పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుతోనే రిజల్ట్‌లో ఓ క్లారిటీ వచ్చింది. ఉదయం నుంచి కాంగ్రెస్ మెజార్టీ పెరుగుతూనే ఉంది.
ములుగు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క ఘన విజయం సాధించింది. తన గెలుపు తర్వాత సీతక్క ట్వీట్ ఏంటో తెలుసా.. 200 కోట్ల రూపాయల కేసీఆర్ డబ్బులు వర్సెస్ సీతక్క.. అవును.. ఈ నియోజకవర్గంలో సీతక్కను ఓడించడానికి బీఆర్ఎస్ 200 కోట్లు ఖర్చుపెట్టిందని ఆరోపణలు వచ్చాయి.
చేసిన ప్రతీ పనికి ఫలితం దక్కుతుందని కర్మ సిద్ధాంతం చెప్తుంది. ఈ మాట ప్రతీ రంగానికి వర్తిస్తుంది.. చివరకు రాజకీయాలకు కూడా ! చేసిన ప్రతీ పనికి ఫలితం ఏదో ఒకరూపంలో కనిపిస్తూనే ఉంటుంది. మంచి చేస్తే మంచి.. ముంచే పనులు చూస్తే ముప్పు. ఇప్పుడిదంతా ఎందుకు అంటే.. ఒక పార్టీ నుంచి గెలిచి.. అధికార పార్టీలోకి జంప్ చేసి.. తమ దశ తిరిగిపోయింది. ఇక తమకు తిరుగేలేదు అనుకునే వారికి.. తెలంగాణ ఎన్నికల ఫలితాలు.. అసలైన దారి చూపించాయ్. ఐదేళ్లు జనాలు మౌనంగా ఉండొచ్చు.. తమదైన రోజు ఎలాంటి ప్రభావం చూపిస్తారో చెప్పకనే చెప్పారు.
తెలంగాణ వాళ్లు కేసీఆర్ ఓడిస్తే.. సీమాంధ్రులు బతికించారు. తెలంగాణ ఉద్యమం నడిచినంత కాలం.. KCR ఆంధ్ర వాళ్ళని అమ్మ నా బూతులు తిట్టేవారు.
రాముడు గుడిని చూపించి ఎన్నో రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన బీజేపీకి హనుమంతుడు చెక్ పెట్టాడు. భక్తి ముసుగులో ఓట్ల లబ్ధి పొందాలని చూసిన కాషాయ పార్టీని కర్ణాటకతో తన్ని తరిమేశాడు.
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పనైపోయిందనుకుంటున్న సమయంలో కర్నాటకలో విజయం ఆ పార్టీకి నైతికంగా ఎంతో బలాన్నిచ్చినట్టయింది. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు, ఈ ఏడాదిలో జరగే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కర్నాటక విజయం కచ్చితంగా బాటలు పరుస్తుంది.