Home » Tag » Coromandel Express
ఊహించని ప్రమాదం జరిగింది.. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు..కుటుంబాలకు తీరని శోకం మిగిలింది.. ఇంతకు మించిన విషాదం ఇంకొకటి ఉండదు అనుకుంటాం..కానీ ప్రమాదంలో చనిపోయిన వ్యక్తులు వవరో తెలియక.. ఆస్పత్రి మార్చురీలోనే రోజుల తరబడి ఆయా మృతదేహాలు ఉంటే.. ఇది కదా పెద్ద విషాదం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్న ఈ కాలంలో కూడా ఓ ప్రమాదంలో చనిపోయిన వ్యక్తులను గుర్తించలేక వాళ్ల డెడ్ బాడీలను ఏం చేయాలో అంతుపట్టని పరిస్థితుల్లో ఉన్నామంటే.. దీన్ని మహా విషాదం అనే చెప్పాలి.
భారత రైల్వే చరిత్రలోనే అత్యంత విషాదకరమైన ఘటనగా మిగిలింది కోరమాండల్ ఎక్స్ప్రెస్ ప్రమాదం. కోరమాండల్ ఎక్స్ ప్రెస్.. పశ్చిమబెంగాల్లోని హౌరా స్టేషన్ నుంచి మొదలై.. తమిళనాడులోని చెన్నై సెంట్రల్ వరకు సుదీర్ఘంగా ప్రయాణిస్తుంది.
గుర్తు తెలియని ఒక వ్యక్తికి సంబంధించిన డైరీ, అందులోని కాగితాలు గుండెల్ని పిండేస్తున్నాయి. ఆ డైరీలో రాసుకున్న ప్రేమ కవితలు మనసును హత్తుకుంటున్నాయి. ఆ రైలులో ప్రయాణించిన వారిలో ఒక వ్యక్తి తన డైరీలో ప్రేమ కవితలు రాసుకున్నారు.
ఇప్పటివరకు 151కిపైగా మృతదేహాల్ని గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మిగతా మృతదేహాల వివరాల్ని గుర్తించడం మాత్రం కష్టంగా ఉంది. దాదాపు 121కిపైగా మృతదేహాల్ని గుర్తించాల్సి ఉంది. దీంతో ఈ ఘటనలో తమ వారిని కోల్పోయిన కుటుంబ సభ్యుల వేదన వర్ణనాతీతం.
ఈ కేసులో కుట్ర కోణం ఉందనే వాదన తెరపైకి వస్తోంది. అందుకే ఈ ఘటనలో నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు సీబీఐ విచారణ జరిపించాలని రైల్వే శాఖ ఆదేశించింది. కాగా, ఈ ఘటనకు గల కారణాల్ని రైల్వే శాఖ గుర్తించింది.
సిగ్నలింగ్ వ్యవస్థలో లోపం వల్ల, రైలు ట్రాకు మారడంతో ఈ ప్రమాదం జరిగింది. సిగ్నల్లో జరిగిన పొరపాటు కారణంగా కోరమాండల్ ఎక్స్ప్రెస్ మరో ట్రాకులోకి మారింది. దీంతో ఆ ట్రాకుపై అప్పటికే ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొంది.