Home » Tag » Cotch Booking
మనం సరదాగా ఎక్కడికైనా సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేయాలంటే ముందుగా గుర్తుకు వచ్చేది ట్రైన్. రైలులో అయితే సీటింగ్ నుంచి వాష్ రూం వరకూ అన్ని సదుపాయాలు ఉంటాయి. పైగా తినేందుకు అవసరమైన ఫుడ్ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్ వాళ్లే సమకూరుస్తారు. మనం చేయవలసిందల్లా ఒక్కటే ప్రయాణానికి తగిన ఏర్పాట్లను ముందస్తుగా చూసుకొని టికెట్ బుక్ చేసుకోవడం. అయితే రైలులో టికెట్ దొరకడం అంటే అంత సులువైన పనికాదు. అయితే కనిష్టంగా మూడు, గరిష్టంగా ఆరు నెలల ముందుగా రిజర్వేషన్ చేసుకోవాలి. ఇలా చేసుకోలేని వారికి తత్కాల్ అనే కోటా ద్వారా ప్రయాణ సదుపాయం కల్పిస్తుంది రైల్వే. ఇదంతా ఒక్కరు లేదా ఒక కుటుంబం ప్రయాణం చేయాలంటే చేయవల్సిన తంతు. అదే ఒక కోచ్ లేదా రైలు మొత్తం బుక్ చేసుకోవాలంటే ఏలా అనే సందేహం అందరిలో కలుగవచ్చు. ఈ సందేహాన్ని క్రింది సమాచారం ద్వారా నివృత్తి చేసుకుందాం.