Home » Tag » counting
రాజ్య సభ (Rajya Sabha) ఎన్నికల (Elections) కోసం కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission Of India) షెడ్యూల్ విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాలతో కలిపి మొత్తం 15 రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా 56 రాజ్యసభ స్థానాలకు ఈ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు.
తెలంగాణలో ఎన్నికల కౌంటింగ్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. పోలింగ్‌కు, కౌంటింగ్‌కు మధ్యలో వినిపిస్తున్న రకరకాల లెక్కలతో నరాలు తెగుతున్నాయట నాయకులకు. మరీ ముఖ్యంగా ఈసారి అధికారం రేసులో లేకున్నా.. కమలం పార్టీ మిగతా వాళ్ళని కంగారు పెడుతోందట. ఆ పార్టీకి ఓటింగ్ శాతం పెరిగిందన్న అంచనాలు మిగతా వాళ్ళకి నిద్ర పట్టనివ్వడం లేదట. ఆ విషయంలో ఎవరి లెక్కలు ఎలా ఉన్నాయి..
తెలంగాణలో పోలింగ్ ముగిసింది. కౌంటింగ్‌కి ఇంకా టైం ఉంది. ఈ మధ్యలో వినిపిస్తున్న రకరకాల లెక్కల వల్ల టెన్షన్‌తో రాజకీయ నాయకుల నరాలు తెగుతున్నాయట. అధికారం రేసులో లేకున్నా.. కమళం పార్టీ కారును హస్తాన్ని టెన్షన్ పెడుతోంది. ఆ పార్టీకి ఓటింగ్ శాతం పెరిగిందన్న అంచనాలు.. మిగతా వాళ్లకు నిద్ర లేకుండా చేస్తున్నాయట. ఆ విషయంలో ఎవరి లెక్కలు ఎలా ఉన్నాయి? బీజేపీ చీల్చే ఓట్లు ఎవరివి? వాటి ప్రభావం ఎంత? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. ఈ సారి తెలంగాణలో దాదాపు 70 శాతం పోలింగ్ జరిగింది.
తెలంగాణ ఎన్నికల ఫలితాలు రావడానికి కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ప్రధాన పార్టీలకు ఎవరి అంచనాలు వారికున్నాయి. 70కి పైగా సీట్లు వస్తాయని బీఆర్ఎస్ అంటోంది. అధికారంలోకి వచ్చేది తామేనని కాంగ్రెస్ ధీమాగా ఉంది. తెలంగాణలో కింగ్ మేకర్‌గా మారబోతున్నామని బీజేపీ చెప్తోంది. ఇందులో.. డిసెంబర్ 3న ఎవరి అంచనాలు నిజమౌతాయి? ఓటర్లు తీర్పు ఎలా ఉంది?