Home » Tag » Coverts
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఓడిపోవడం... కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి కూడా రెండు నెలలైంది. చంద్రబాబు పవర్ లోకిగా రాగానే... జగన్ తో అంటకాగిన అధికారుల్లో కొందర్ని పక్కనపెట్టేశారు. వాళ్ళకి పోస్టింగ్స్ ఇవ్వలేదు. మరికొందర్ని తన పేషీ నుంచి తీసేసి లూప్ లైన్లో పడేశారు.
తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది ఉన్నతాధికారులపై తీవ్రస్థాయిలో ఆరోపణలు, విమర్శలు చేసింది కాంగ్రెస్ పార్టీ. రిటైర్ అయ్యాక కూడా కొందరికి ఎక్స్టెన్షన్ ఇచ్చి మరీ కొనసాగించడాన్ని అప్పట్లో తప్పుపట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే.. పరిస్థితిని గమనించిన అలాంటి ఆఫీసర్లలో కొందరు, మరికొందరు సలహాదారులు కూడా రాజీనామాలు చేశారు. ఇంకొంతమంది మీద రేవంత్ సర్కార్ వేటేసింది.
కాలానుగుణంగా ఎన్నికల స్టైల్ మారిపోతోంది. నేరుగా చేసే యుద్దంతో పాటు.. తెర వెనుక ఉండి పని చేసే కన్పించని శత్రువులతో కూడా పోరాడుతున్నాయి రాజకీయ పార్టీలు. ప్రతిచోటా అదే జరుగుతున్నా.. ఏపీలో ఇంకొంచెం ఎక్కువ అన్నట్టుగా ఉంది వ్యవహారం. ముఖ్యంగా వైసీపీ-టీడీపీ మధ్య జరుగుతున్న ఎన్నికల యుద్దంలో బ్యాక్ ఆఫీస్ కార్యకలాపాలపై నిఘాలు పెరుగుతున్నాయట.