Home » Tag » Cricket Team
గత కొంతకాలంగా భారత క్రికెట్ జట్టులో ప్రతీ ప్లేస్ కూ కనీసం ముగ్గురు నుంచి నలుగురు పోటీపడుతున్నారు. అందుకే తుది జట్టు ఎంపిక క్లిష్టంగా మారుతోంది. పిచ్ పరిస్థితి , ప్రత్యర్థిని అంచనా వేసుకుని ఫైనల్ ఎలెవన్ కాంబినేషన్ ను సెట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆసీస్ టూర్ లో రెండో టెస్టుకు భారత తుది జట్టు ఎంపిక ఛాలెంజ్ గా మారింది.
భారత క్రికెట్ జట్లు కొత్త లుక్ లో కనిపించబోతున్నాయి. పురుషుల, మహిళల జట్లకు సంబంధించి వన్డేల్లో ధరించేందుకు బీసీసీఐ కొత్త జెర్సీని లాంఛ్ చేసింది.
అంతర్జాతీయ క్రికెట్ లో మరో శకం ముగిసింది. టెస్ట్ క్రికెట్ లో రికార్డుల మీద రికార్డులు సృష్టించిన ఇంగ్లాండ్ స్టార్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ కెరీర్ కు వీడ్కోలు పలికాడు.
టీమిండియా ప్రస్తుత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం టీ20 ప్రపంచకప్-2024తో ముగియనుంది. దీంతో కొత్త కోచ్‌ను భర్తీ చేసే పనిలో బీసీసీఐ పడింది.
క్రికెట్లో టీమ్ (Cricket Team) లా ఆడితేనే గెలుస్తారు.. సెల్ఫిష్ అనే పదానికి తావు ఉండకూడదు.. అయితే ప్రస్తుత ఐపీఎల్ (IPL) లో మాత్రం పలువురు ప్లేయర్స్ వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశంగా మారింది.
పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజం, పీసీబీ అధ్యక్షుడు జాక్ అష్రఫ్ మధ్య జరిగిన వాట్సాప్ చాట్ లీక్ కేసు పాకిస్థాన్ క్రికెట్లో పెను దుమారం రేపడమే కాకుండా రోజురోజుకు సరికొత్త మలుపులు తిరుగుతోంది. ముఖ్యంగా పాకిస్థాన్ బోర్డు ప్రెసిడెంట్ జాక్ అష్రాఫ్ ఈ చర్యపై పాక్ జట్టు మాజీ ఆటగాళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు పాకిస్థాన్ క్రికెట్ టీమ్ వార్తల్లో నిలిచింది. ఆసియా కప్‌లో ఘోర పరాజయం.. అలాగే ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లు రెండింటిలోనూ 300కు పైగా పరుగులు చేసినా పరాజయం కావడంతో ఆ జట్టుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇక మెగా టోర్నీ క్రికెట్ ఆరంభంలో పాక్ క్రికెట్ జట్టు ఆటతీరు చాలా మందిని విస్మయ పరిచింది. నెదర్లాండ్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో త్రుటిలో ఓటమి నుంచి తప్పించుకుంది. వీటన్నింటి మధ్య పాక్ జట్టు ఇప్పుడు కొత్త వివాదంతో మరోసారి వార్తల్లో నిలిచింది.
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023లో హైదరాబాద్‌కు విచ్చేసిన పాకిస్తాన్ క్రికెట్ టీం.. మ్యాచ్‌ల విరామంలో.. వీలు దొరికినప్పుడల్లా భాగ్యనగర రుచులను ఎంజాయ్ చేస్తోంది. నగరంలోని టాప్ హోటల్స్‌లో పాక్ ఆటగాళ్లు దేశీయ రుచులను ఆస్వాదిస్తూ.. సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే శనివారం నగరంలో ప్రముఖ హోటల్ 'పెషావర్ రెస్టారెంట్'లో హైదరాబాదీ వంటకాలను ఎంజాయ్ చేస్తూ కనిపించారు పాక్ క్రికెటర్లు.
భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 116 పరుగులు చేసింది. స్మృతి మంధాన 46, జెమీమా రోడ్రిగ్స్ 42 పరుగులతో రాణించారు. అనంతరం 117 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక 20 ఓవర్లలో 8 వికెట్లకు 97 పరుగులు మాత్రమే చేసింది. దీంతో భారత్ విజయం సాధించింది.
ఫైనల్ చేరిన టీమిండియా.. పతకం ఖాయం చేసుకుంది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్.. టీమిండియా బౌలర్ల ధాటికి కేవలం 17.5 ఓవరల్లో 51 పరుగులకే ఆలౌట్ అయింది. బంగ్లా బ్యాటర్లలో నిగార్ సుల్తానా 12 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది.