Home » Tag » Cyber Attack
సైబర్ మోసగాళ్ళు రోజు రోజుకీ తెలివిమీరుతున్నారు. టెక్నాలజీని (Technology) వాడుకుంటూ జనాన్ని బురిడీ కొట్టిస్తూ కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు. స్మార్ట్ ఫోన్ (Smart phone) వాడుతున్న ప్రతి ఒక్కరికీ వాట్సాప్ ఉంటుంది. ఈ వాట్సాప్ వినియోగదారులే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. అందుకే అప్రమత్తంగా ఉండాలంటూ బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సలహా ఇస్తోంది.
రోజుకు 3కోట్ల రూపాయలు... గత 8 నెలల్లో 707 కోట్ల రూపాయలను కొట్టేశారు సైబర్ మాయగాళ్ళు. తెలంగాణ జనం దగ్గర అందినంత దోచుకున్నారు. 2023లో మొత్తం 16 వేలకు పైగా సైబర్ నేరాలు జరిగితే... ఇందులో 15 వేల దాకా ఆర్థిక మోసాలే ఉన్నాయి. రోజుకో ప్లాన్ తో చదువుకున్నవారు... చదువులేని వాళ్ళని.... అందర్నీ నిలువునా ముంచేశారు కేటుగాళ్ళు.
భారతదేశంలోని ప్రముఖ లగ్జరీ హోటల్ తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్. గత కొన్ని సంవత్సరాలుగా ఈ హోటల్ పై దాడులు జరుగుతునే ఉన్నాయి. చరిత్రలో ఎప్పుడూ చూడని.. భారీ బాంబు పేలుడు ఈ హోటల్ జరిగిన విషయం మీకు తెలిసిందే.. చాలా సార్లు పాకిస్థాన్ నుంచి బాంబు బెదిరింపులు ఈ హోటల్ కు వస్తునే ఉన్నాయి. తాజాగా మరో బెదిరింపు కూడా వచ్చింది ఈ హోటల్ కు.. కానీ అది బాంబు బెదిరింపు అయితే కాదు.. సైబర్ బెదిరింపులు.