Home » Tag » cyber crimes
అయోధ్య రాముడికి ఉన్న ఇమేజ్ క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు సైబర్ క్రిమినల్స్. ప్రజలకు ఫేక్ లింక్స్ పంపుతున్నారు. వాటిని ఓపెన్ చేస్తే చాలు.. బ్యాంకు ఖాతాల నుంచి ఉన్నదంతా ఊడ్చేస్తున్నారు. ఇలాంటి ఫేక్ గాళ్ళు ఇండియాలోనే కాదు.. పాకిస్తాన్ నుంచి కూడా ఆపరేట్ చేస్తున్నారు.
దేశంలో సైబర్ నేరాలు (Cyber Crimes) రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. కాస్త ఏమరపాటుగా ఉంటే చాలు.. అసలుకే ఎసరు పెట్టేస్తున్నారు కేటుగాళ్లు. ఫేక్ లింకులు (Fake Links) పంపి అకౌంట్లు హ్యాక్ (Bank Accounts) చేసేవాళ్లు కొందరైతే.. అబద్ధాలు చెప్పి డబ్బు గుంజేవాళ్లు ఇంకొందరు. ప్రాసెస్ ఏదైనా చేసే పని మాత్రం డబ్బు దోచుకోవడం. ఒకప్పుడు దోపిడీ అంటే దారి దోపిడీలు, ఇంటి దోపిడీలు ఉండేవి. కానీ ఇప్పుడు దోపిడీలు కూడా డిజిటలైజ్ ఐపోయాయి.
రోజుకు 3కోట్ల రూపాయలు... గత 8 నెలల్లో 707 కోట్ల రూపాయలను కొట్టేశారు సైబర్ మాయగాళ్ళు. తెలంగాణ జనం దగ్గర అందినంత దోచుకున్నారు. 2023లో మొత్తం 16 వేలకు పైగా సైబర్ నేరాలు జరిగితే... ఇందులో 15 వేల దాకా ఆర్థిక మోసాలే ఉన్నాయి. రోజుకో ప్లాన్ తో చదువుకున్నవారు... చదువులేని వాళ్ళని.... అందర్నీ నిలువునా ముంచేశారు కేటుగాళ్ళు.
వాట్సప్ ఉపయోగించే వారు ఎలాంటి ప్రభుత్వ పరమైన చిక్కుల్లో పడకుండా ఉంటాలంటే ఈ క్రింది సూచనలు పాటించాలి. అంతేకాకుండా ఎలాంటి సైబర్ నేరాల బారిన పడకుండా సురక్షితంగా ఉండాలంటే ఈ అంశాలను గమనించండి.
ఒకటి రెండు గంటలు పార్ట్ టైమ్ జాబ్ చేయండి.. ఈజీగా మనీ సంపాదించవచ్చని టెంప్ట్ చేస్తున్నారు. దీంతో చాలా మంది వాళ్ల మాయలో పడిపోయి వాళ్లు చెప్పినట్టు చేస్తున్నారు. మొదట్లో వాళ్లు పంపిన లింక్స్ ను క్లిక్ చేయమనో, షేర్ చేయమనో చెప్తారు. అలా చేస్తే మన అకౌంట్లో నగదు జమ చేస్తారు. దీంతో చాలా మంది ఆశపడి అందులో కంటిన్యూ అవుతున్నారు. ఆ తర్వాతే మొదలవుతుంది అసలు కథ.
ప్రస్తుత కాలంలో మొబైల్ అనేది నిత్యవసర వస్తువు కన్నా అత్యవసర వస్తువుగా మారిపోయింది. మనకు కావల్సిన నిత్యవసరాలనే ఫోన్ నుంచి రకరకాల యాప్ ల సహాయంతో ఇంటికి డెలివరీ చేయించుకుంటూ ఉంటాం. అలా చేసుకోవాలంటే మనఫోన్ అత్యంత ఆధునీకతను అందిపుచ్చుకుంటూ ఉండాలి. దీని కోసం మనం ఏం చేయాలో తెలుసా..?