Home » Tag » Cyber Criminals
టెక్నాలజీతో ఉపయోగం ఎంత ఉందో.. దారుణాలు కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయ్. ఏఐ వచ్చాక మరింత పెరిగాయ్ కూడా ! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకొని.. సైబర్ నేరగాళ్లు చేస్తున్న దారుణాలు అన్నీ ఇన్నీ కావు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎవరినీ వదలడం లేదు. నానా ఇబ్బందులు పెడుతూ పిచ్చి వేషాలు వేస్తున్నారు.
మీరు ప్రయాణానికి బయల్దేరుతుంటే ఇకపై మీ మొబైల్ ఫుల్లుగా ఛార్జింగ్ పెట్టుకోండి. మధ్యలో అయిపోతుంది అనుకుంటే... తప్పనిసరిగా మీ వెంట పవర్ బ్యాంక్ (Power bank) తీసుకెళ్ళండి. పబ్లిక్ ఛార్జింగ్ పాయింట్స్ లో మొబైల్ చార్జ్ చేస్తే అంతే... మీ డేటా మొత్తం సైబర్ నేరగాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది.
నటి రష్మిక మందాన (Rashmika Mandana) డీప్ ఫేక్ ( Deep Fake) వీడియో నిందితుడు ఈమని నవీన్ (Naveen) ను పట్టుకోడానికి పోలీసులు దేశవ్యాప్తంగా పెద్ద ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. టెక్నాలజీ ఉపయోగించి నిందితుడు తప్పించుకోవాలని చూసినా .. దాన్ని ప్రూవ్ చేయడానికి పోలీసులు ఢిల్లీ నుంచి గుంటూరు దాకా పెద్ద నెట్ వర్క్ ను ఛేదించాల్సి వచ్చింది.
జనవరి 22న అయోధ్యలోని శ్రీరామ మందిరంలో రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరుగుతోంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని సైబర్ క్రిమినల్స్, కేటుగాళ్ళు రెచ్చిపోతున్నారు. అయోధ్యలో టిక్కెట్ల పేరుతో ఫేక్ కాల్స్ చేసి జనాన్ని దోచుకుంటున్నారు. అలాగే ఇప్పుడు కొత్తగా రాముడి ఫోటోతో 500 రూపాయల నోట్ ఒకటి సోషల్ మీడియాలో తిరుగుతోంది. ఓ వైపు రాముడు, మరోవైపు రామ మందిరంతో నకిలీ 500 నోట్ ఫోటోలు సర్క్యులేట్ అవుతున్నాయి.
రోజుకు 3కోట్ల రూపాయలు... గత 8 నెలల్లో 707 కోట్ల రూపాయలను కొట్టేశారు సైబర్ మాయగాళ్ళు. తెలంగాణ జనం దగ్గర అందినంత దోచుకున్నారు. 2023లో మొత్తం 16 వేలకు పైగా సైబర్ నేరాలు జరిగితే... ఇందులో 15 వేల దాకా ఆర్థిక మోసాలే ఉన్నాయి. రోజుకో ప్లాన్ తో చదువుకున్నవారు... చదువులేని వాళ్ళని.... అందర్నీ నిలువునా ముంచేశారు కేటుగాళ్ళు.
ఒకప్పుడు ఇంటర్నెట్ను బేస్ చేసుకున్న సైబర్ నేరగాళ్లు ఇప్పుడు కాల్స్‌లో కూడా మాయ చేసి మనీ దోచేస్తున్నారు.