Home » Tag » Cyber Fraud
ఇజ్రాయెల్ NSO గ్రూప్‌నకు చెందిన పెగాసెస్ నుంచి ఈ స్పైవేర్ రిలీజ్ అయింది. భారత్ సహా 92 దేశాల్లోని యూజర్ల యాపిల్ ఐడీలకు వార్నింగ్ మెస్సేజ్‌లు, మెయిల్స్ కూడా పంపింది యాపిల్ సంస్థ. గతంలో కూడా పెగాసిస్ నుంచి ముప్పు పొంచి ఉన్నట్టు వార్నింగ్ ఇచ్చింది.
నెలలో మొత్తం 150 కోట్లను సైబర్ దొంగలు కొట్టేస్తే అందులో 22 కోట్లను మాత్రమే పోలీసులు సకాలంలో ఆపగలిగారు. ఇన్వెస్ట్మెంట్ పేరుతో శేరిలింగంపల్లికి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి దగ్గర 60 లక్షల రూపాయలను కొట్టేశారు.
దేశంలో సైబర్ నేరాలు (Cyber Crimes) రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. కాస్త ఏమరపాటుగా ఉంటే చాలు.. అసలుకే ఎసరు పెట్టేస్తున్నారు కేటుగాళ్లు. ఫేక్ లింకులు (Fake Links) పంపి అకౌంట్లు హ్యాక్ (Bank Accounts) చేసేవాళ్లు కొందరైతే.. అబద్ధాలు చెప్పి డబ్బు గుంజేవాళ్లు ఇంకొందరు. ప్రాసెస్ ఏదైనా చేసే పని మాత్రం డబ్బు దోచుకోవడం. ఒకప్పుడు దోపిడీ అంటే దారి దోపిడీలు, ఇంటి దోపిడీలు ఉండేవి. కానీ ఇప్పుడు దోపిడీలు కూడా డిజిటలైజ్ ఐపోయాయి.
సిమ్ డీ యాక్టివేట్ అయిన కొన్ని గంటలకే మీ నెంబర్‌తో లింక్ అయి ఉన్న బ్యాంక్ అకౌంట్ మొత్తం ఖాళీ అయిపోతుంది. మీ ప్రమేయం లేకుండానే మీ ఖాతా నుంచి డబ్బులు వేరే ఖాతాలోకి వెళ్లిపోతాయి. మీరు ప్రమాదాన్ని గుర్తించేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఇంతకీ సిమ్ కార్డు డీయాక్టివేషన్‌కు, బ్యాంక్ అకౌంట్ ఖాళీ అవ్వడానికి సంబంధం ఏంటి..? మీ డబ్బులను కాజేసింది ఎవరు..?