Home » Tag » Cyberabad Police
ఖమ్మం జిల్లా బోనకల్‌కు చెందిన కేపీ చౌదరి.. 2016లో సినీ ఇండస్ట్రీలోకి డిస్ట్రిబ్యూటర్‌గా అడుగుపెట్టాడు. సర్దార్ గబ్బర్‌సింగ్, అర్జున్ సురవరం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి సినిమాలకు కేసీ డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్నాడు. రజినీకాంత్ హీరోగా వచ్చిన కబాలి సినిమాను ప్రొడ్యూస్ కూడా చేశాడు.
హైదరాబాద్ లో రోజురోజుకూ డ్రగ్ కల్చర్ పెరిగిపోతుంది. దీనికి ప్రదానమైన వేదిక పబ్బులు అనే చెప్పాలి. కొన్ని పబ్బులో ఇలాంటి మాదకద్రవ్యాల వ్యాపారం గుట్టు చప్పుడు కాకుండా జరుగుతూనే ఉంటుంది. తాజాగా తెలుగు కబాలి సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన కృష్ణ ప్రసాద్ చౌదరిని మాదకద్రవ్యాల విక్రయం కేసులో సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని తాజాగా ప్రకటించారు. కేపీ చౌదరీ కొకైన్ అమ్ముతుండగానే పట్టుకున్నట్లు తెలిపారు. ఇతని వద్ద నుంచి సుమారు 82.75 గ్రాముల కొకైన్ తో పాటూ ఒక కారు, 2 లక్షలకు పైగా నగదు, నాలుగు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
సినిమా ఇండస్ట్రీని డ్రగ్స్ కేసు అంత ఈజీగా వదిలేలా కనిపించడం లేదు. సరిగ్గా ఐదేళ్ల కింద డ్రగ్స్ కేసు రేపిన రచ్చ అంతా ఇంతా కాదు. ఎక్కడో స్కూల్లో డ్రగ్స్ దొరకడం.. కూపీ లాగితే డొంక బ్యాంకాక్‌లో కదలడం.. ఈ కేసులో సినీ తారల పాత్ర ఉందని తెలియడం.. దాదాపు 12మంది స్టార్లకు అప్పట్లో సిట్ నోటీసులు ఇవ్వడం జరిగింది.
వీడు నకిలీలకే నకిలీ. ఏకంగా ఐపీఎస్‌నంటూ అందరిని నమ్మించాడు. చెప్పిన అబద్దం.. చేసిన పాపం ఎక్కువ రోజులు నిలవదు కదా.. ఇతని విషయంలో అదే జరిగింది. ఇప్పుడు జైలు ఊచలు లెక్కిస్తున్నాడు. ఇతని పేరు నాగరాజు అలియాస్ రామ్ ఐపీఎస్.