Home » Tag » Cyclone
అట్లాంటిక్ మహాసముద్రం (Atlantic Ocean) లో రాకాసి అలలు అలజడి సృష్టిస్తున్నాయి.
మిగ్ జాం తుఫాన్ తో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ కు మరో తుఫాన్ ప్రమాదం పొంచి ఉంది. రైతలకు మరో భారీ నష్టం తప్పేలా లేదు
తుఫాన్ తీరం దాటినా.. జనం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. మిచౌంగ్ తుఫాన్ తీరం దాటిన తర్వాత 24 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం శుక్రవారం తుపానుగా బలపడింది. ఇవాళ బంగ్లాదేశ్ తీరంలో తీరం దాటింది అని ఐఎండీ (IMD) ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా దీంతో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కు తుఫాన్ (Cyclone) ముప్పు తప్పింది.
గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు బాగా కురిశాయి. అయితే రెండు రోజులుగా మళ్ళీ ఉష్ణోగ్రతలు కొంచం పెరిగాయి. తాజాగా హైదరాబాద్ వాతావరణ శాఖ మరోసారి వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. రానున్న ఐదురోజుల పాటూ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ పరిస్థితి వచ్చే మంగళవారం వరకూ కొనసాగవచ్చంటున్నారు.
వర్షాలు కురిస్తే ఒక తంట.. కురవక పోతే ఎండలతో మంట. ఇలా తయారైంది ప్రస్తుత వాతావరణం పరిస్థితి. ఇది కేవలం మన తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదు. దక్షిణ భారతదేశం మొత్తం ఇదే పరిస్థితి కొనసాగుతోంది.
వారం రోజులు వరుణుడు చేసిన బ్యాటింగ్‌కు తెలుగు రాష్ట్రాలు అల్లకల్లోలం అయ్యాయ్. వరద ధాటికి చాలా జీవితాలు.. రోడ్డున పడ్డాయ్. వానలు తగ్గాయ్.. వరదలు అదుపులోకి వచ్చాయని సంతోషించేలోపే.. మరో ప్రమాదం ముంచుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయ్.
భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దవుతున్నాయ్. అదేదో పగపట్టినట్లు వానలు కురిపిస్తున్నాడు వరుణుడు. నిన్నటివరకు వర్షాలు లేవని బాధపడిన కళ్లే.. ఇప్పుడు వానలు ఆగిపోతే బాగుండు అని వేడుకుంటున్నాయ్.
నాలుగు రోజులు అయింది సూర్యుడు కనిపించి. ఆకాశానికి చిల్లు పడిందా.. ఆ చిల్లు లోంచి నీరు కారుతుందా అనే రేంజ్లో వర్షాలు కురుస్తున్నాయి. నాన్‌స్టాప్ ముసురు చిరాకు తెప్పిస్తోంది జనాలకు. కరువు తీరేలా పడ్తున్నాయి వర్షాలు. అక్కడ ఇక్కడ అని తేడా లేదు.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రతీ మూలలో ఇదే సీన్.
అల్పపీడన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయ్. 48గంటలుగా నాన్‌స్టాప్ వర్షాలతో అనేక ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది.