Home » Tag » Danam Nagender
దానం నాగేందర్.. పొలిటికల్ జంపింగ్ స్టార్ అంటూ ట్రోలింగ్ చేస్తుంటారు చాలామంది. కాంగ్రెస్ నుంచి టీడీపీ.. టీడీపీ నుంచి కాంగ్రెస్.. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్.. బీఆర్ఎస్ నుంచి మళ్లీ కాంగ్రెస్.. ఇలా దాదాపు అన్ని పార్టీలు కవర్ చేశారు దానం.
సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో... 2019లో గెలిచిన కిషన్ రెడ్డి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. బీజేపీ ఫస్ట్ లిస్టులోనే టిక్కెట్ రావడంతో... నియోజకవర్గంలో అందరికంటే ముందే ప్రచారం ప్రారంభించారు. నిత్యం ఓటర్లతో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. 2019లో ఈ లోక్ సభ నియోజకవర్గంలో బీజేపీ ఒక్క ఎమ్మెల్యే గెలవకున్నా... మోడీ ఇమేజ్ తో కిషన్ రెడ్డి గెలిచారు. ఈసారి కూడా మోడీ గ్యారంటీలతో మళ్ళీ విసయం సాధిస్తామని ధీమాగా ఉన్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పార్టీలోకి వెళ్లిపోయారు. నిజానికి ఇలా పార్టీ ఫిరాయిస్తే.. ఫిరాయింపుల చట్టం ప్రకారం ఆ ఎమ్మెల్యే పదవి రద్దు కావాలి.
దానం నాగేందర్ అసలు మంత్రి పదవిపై ఆశతోనే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారట. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ కు ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా దక్కలేదు. దాంతో పక్కాగా తనకు మంత్రి పదవి ఇస్తారని ఆశపెట్టుకున్నారు.
తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ స్థానాల్లో ఇప్పటి వరకూ 13 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసింది కాంగ్రెస్. ఇంకా 4 స్థానాలు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిల్లో వరంగల్ సీటు కడియం కావ్యకు ఇచ్చే అవకాశముంది. బీఆర్ఎస్ టిక్కెట్‌ను త్యాగం చేసి వచ్చిన కావ్యకు కాంగ్రెస్‌లో కన్ఫమ్ అయినట్టే అని చెబుతున్నారు.
ఆయనపై అనర్హత వేటు వేయాలంటూ స్పీకర్ ప్రసాద్ కుమార్‌కు వినతిపత్రం ఇచ్చింది. మరి స్పీకర్ దానం అనర్హతపై వెంటనే నిర్ణయం తీసుకుంటారా.. లేకపోతే గత ప్రభుత్వాల్లో లాగా ఐదేళ్ళ పాటు తన దగ్గరే పెట్టుకొని ఏ నిర్ణయం తీసుకోకుండా వదిలేస్తారా.. అన్నది చూడాలి.
ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, లీడర్ల కోసం... సీఎం రేవంత్ రెడ్డి... కాంగ్రెస్ (Congress) గేట్లు బార్లా తెరవంగానే ఖైరతాబాద్ (Khairatabad) ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagender) దూరిపోయారు. ఇప్పటికిప్పుడు ఏడుగురు ఎమ్మెల్యేలు జాయిన్ అవుతారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. రాబోయే రోజుల్లో సగానికి పైగా ఎమ్మెల్యేలను లాక్కొని BRS LPని విలీనం చేసుకోవాలని కాంగ్రెస్ చూస్తోంది.