Home » Tag » Delhi excise policy case
తిహార్ జైలులో ఉన్న కవితను సీబీఐ గురువారం అరెస్టు చేసింది. ఈ క్రమంలో కవితను జ్యుడీషీయల్ కస్టడీ నుంచి సీబీఐ హెడ్ క్వార్టర్స్‌కు తరలించనున్నారు. కవితను సీబీఐ శుక్రవారం కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది.
లిక్కర్ స్కాంలో ఈడీ కవితను అరెస్టు చేసి విచారించింది. అనంతరం ఈడీ వినతి ప్రకారం.. కవిత ప్రస్తుతం జుడీషియల్ కస్టడీలో భాగంగా తిహార్ జైలులో ఉంది. లిక్కర్ స్కాంలో కవితను విచారించాలని సీబీఐ నిర్ణయించింది. నిజానికి.. గతంలోనే కవితను సీబీఐ విచారించింది.
అప్రూవర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా మాత్రమే కవితను అరెస్టు చేశారని కోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన సుప్రీం ధర్మాసనం.. తాము కేసు మెరిట్స్‌లోకి వెళ్లడం లేదని.. అయితే, ఇప్పుడు బెయిల్ ఇవ్వలేమని తెలిపింది. బెయిల్ కోసం కింది కోర్టును ఆశ్రయించాల్సిందిగా సూచించింది.