Home » Tag » DELHI LIQOUR SCAM
11 పేజీలున్న పిటిషన్ లో ఎన్నో కీలక అంశాలు బయటపడ్డాయి. కవిత గురించి కోర్టుకు కీలక విషయాలు తెలిపారు సీబీఐ అధికారులు. లిక్కర్ కేసులో కవిత కీలక వ్యక్తి అనీ.. ఆప్‌కి వంద కోట్ల ముడుపులు కవితే చెల్లించినట్టు వివరించారు.
లిక్కర్ తో పాటు మనీలాండరింగ్ కేసుల్లో అరెస్ట్ అయిన కేజ్రీవాల్ కి సీఎం గా కొనసాగే అర్హత లేదని పిటిషన్ వాదించారు. అది తమకు సంబంధం లేని అంశమనీ.. ఈ విషయంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ లేదా రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాలని చెప్పింది.
కేజ్రీవాల్ పాస్వర్డ్స్ చెప్పడం లేదు. అయినప్పటికీ ఐఫోన్‌ను యాక్సెస్ చేసేందుకు అధికారులు ప్రయత్నించి విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో తాము కేజ్రీవాల్ ఫోన్ యాక్సెస్ చేసేందుకు సహకరించాల్సిందిగా ఈడీ అధికారులు యాపిల్ సంస్థను కోరారు.
ఇంటి భోజనం తినే అవకాశం కల్పించాలని, అలాగే బెడ్, మందులు, కళ్లద్దాలు అందించాలని కవిత కోరింది. పుస్తకాలు చదువుకునేందుకు అనుమతించాలని, మంగళసూత్రం ధరించేందుకు కూడా అనుమతివ్వాలని కవిత పిటిషన్లో కోరింది.
జైలులో ఉన్న కేజ్రీవాల్ రాజీనామా చేయాలని, ఆయనను పదవి నుంచి తొలగించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. అయితే, ఈ పిటిషన్‌ను జస్టిస్ మన్మోహన్, జస్టిస్ మన్మిత్ ప్రీత్‌లతో కూడిన హైకోర్టు ధర్మాసనం గురువారం కొట్టివేసింది.
తిహార్ జైల్లో మరో ఇద్దరు ఖైదీలతో కలిపి జైల్ నెంబర్ 6 లో కవితను ఉంచారు అధికారులు. ఇంటి నుంచి ఆహారం, దిండ్లు, దుప్పట్లు, బట్టలు, బెడ్ షీట్స్, బ్లాంకెట్స్, బుక్స్, పెన్ను, పేపర్, మెడిసిన్స్ తెచ్చుకోడానికి రౌస్ అవెన్యూ కోర్టు కవితకు అనుమతి ఇచ్చింది.
తాను జైలులో ఉన్నప్పటికీ పాలన కొనసాగిస్తానని సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. అంతేకాదు.. అన్నట్లుగానే.. కస్టడీ నుంచి ఇటీవల అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. రెండు రోజుల క్రితం ఢిల్లీ తాగునీటి సమస్య గురించి ఆదేశాలిచ్చారు. దీనిపైనే ఈడీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కొడుకు ఆర్యను చూడగానే కవిత తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తల్లిని చూడగానే ఆర్య కూడా కన్నీళ్లు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. తల్లీకొడుకుల భావోద్వేగం చూసి.. చుట్టూ పక్కన ఉన్న వాళ్లు కూడా చాలా ఎమోషనల్ అయ్యారని తెలుస్తోంది.
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమితో పొత్తు పెట్టుకున్నందుకు కేజ్రీవాల్‌ని.. బీఆర్ఎస్తో పొత్తు లేదని చెప్పడానికి కవితను అరెస్ట్ చేస్తారన్న టాక్ నడుస్తోంది. ఇప్పటికి 7 సార్లు ఈడీ నోటీసులు ఇచ్చినా.. ఢిల్లీ సీఎం ఏదో ఒక కారణంతో విచారణకు అటెండ్ అవ్వడం లేదు.