Home » Tag » Delhi Police
స్వేచ్చ ఉంది.. సోషల్ మీడియా అకౌంట్ ఉంది.. ఇంగ్లీష్ జ్ఞానం ఉంది.. వెటకారం చేసే గుణం ఉంది కదా అని.. ఇష్టమొచ్చిన రాతలు రాస్తే పుట్టగతులు ఉండవు. ప్రణీత్ అనే నీచుడు చేసిన రచ్చను ఇంకా ఎవరూ మర్చిపోలేదు.
హైదరాబాద్ కు మరో సారి ఢిల్లీ పోలీసులు (Delhi Police) చేరుకున్నారు. దీంతో హైదరాబాద్ లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
మీ బ్యాంక్ అకౌంట్ నుంచి వచ్చినట్లుగా కొందరు ఫేక్ లింక్స్ క్రియేట్ చేస్తున్నారు. వాటిని గుర్తించడం సాధారణంగా కష్టం. కానీ, కొంచెం అవగాహన కలిగి ఉంటే.. అలాంటి ఫేక్ లింక్స్‌ను ఈజీగా గుర్తించవచ్చు. దీనిపై అవగాహన కలిగేలా ఢిల్లీ పోలీసులు చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.
లోక్ సభలో స్మోక్ షెల్స్ విసిరి గందరగోళం సృష్టించిన కేసుపై ఢిల్లీ పోలీసులు, కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణ జరుగుతోంది. నిందితులు అసలు ఈ దాడికి ఎందుకు పాల్పడ్డారు.. వీళ్ళ వెనక ఉగ్రవాద సంస్థల ప్రమేయం ఉందా అన్న కోణంలో ఎంక్వైరీ నడుస్తోంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరక్కుండా పార్లమెంటు ఆవరణలో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. బాడీ స్కానర్స్ లాంటివి తెప్పిస్తున్నారు. భద్రతా ఉల్లంఘనపై 8 మంది భద్రతా సిబ్బందిని సస్పెండ్ చేసింది లోక్ సభ సెక్రటరియేట్.
రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియోపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వీడియోను రూపొందించిన అకౌంట్‌కి సంబంధించి URL వివరాలను తెలపాలని సోషల్ మీడియా దిగ్గజం మెటాను కోరారు. వీడియో తయారు చేసి అప్లోడ్ చేసిన అకౌంట్ URL IDని యాక్సెస్ చేయడానికి మెటాకు లేఖ రాసినట్టు పోలీసులు తెలిపారు.
ఘర్షణలకు వ్యతిరేకంగా ఢిల్లీలో బుధవారం నుంచి వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు చేపట్టారు. ఈ ర్యాలీల వల్ల ఢిల్లీలో కూడా శాంతి భద్రతలు క్షీణించే అవకాశాలున్నాయని, వీటిని నిలిపివేయాలని కోరుతూ.. సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.
వాళ్లు.. దేశానికి పతకాల పంట పండించిన క్రీడాకారులు.. మూడు రంగుల జెండాను ఎత్తుకుని గర్వంగా నిలబడ్డ వాళ్లు.. చుట్టూ ఉన్న ప్రేక్షకులంతా చప్పట్లు కొడుతుంటే.. అవి తమకు మాత్రమే కాదు.. మొత్తం భారత దేశానికి అని భావించిన వాళ్లు. పతకాలతో దేశం తిరిగొస్తే.. అభిమానులతో ఘన స్వాగతం అందుకున్న వాళ్లు.. ఇదంతా గతం..! ఇంత కీర్తి అందుకుని, కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలిచిన క్రీడాకారులు ఇప్పుడు ఇదే దేశంలో కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అధికార బలానికి, పోలీసుల కాఠిన్యానికి బలవుతున్నారు.
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను ప్రభుత్వం అరెస్టు చేయడంతో దేశవ్యాప్తంగా ఆందోళన, హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. అయితే, ఈ ఘటనలకు ఇండియా, మోదీనే కారణమంటూ పాక్ యువతి ఒక ట్వీట్ చేసింది. దీనికి ఢిల్లీ పోలీసులు సరైన జవాబిచ్చారు.
బేటీ పడావో బేటీ బచావో అని ప్రధానమంత్రితో పాటు ఆయన సహచర నేతలు నినదించినప్పుడు ఈ దేశం మొత్తం ఉప్పొంగిపోయింది. ఆడపిల్లల రక్షణ విషయంలో, వాళ్ల భవిష్యత్తు విషయంలో బీజేపీ ప్రభుత్వానికి ఎంత కమిట్మెంట్ ఉందో అంటూ కీర్తించింది. కానీ మోదీ సహా బీజేపీ పరివారం మొత్తం బేటీ బచావో బేటీ పడావో అంటూ పైకి మాటలు చెబుతున్నారు తప్ప.. వాళ్లకు కనీస భరోసా ఇవ్వలేకపోతున్నారన్న విషయం అర్థంకావడానికి ఎక్కువ సమయం పట్టలేదు.