Home » Tag » Dharmapuri Arvind
రైతు ఉద్యమాలకు పుట్టినిల్లు... ఇందూరు పార్లమెంట్ నియోజకవర్గం. పసుపు బోర్డు (Yellow Board), గల్ఫ్ కుటుంబాలు(Gulf Families), నిజాం చక్కర కర్మాగారం(Nizam Chakkar Factory), బీడీ కార్మికుల సమస్యలు ఇక్కడ ఇవే ప్రధాన సమస్యలు. నిజామాబాద్ లో పోటీ చేసే అభ్యర్థుల ప్రచారం అంతా ఈ సమస్యలపైనే నడుస్తుంది. ముఖ్యంగా ఈసారి పసుపు బోర్డు అంశం ఎన్నికల్లో ప్రధాన అస్త్రం కాబోతోంది. కేంద్రం నుంచి బోర్డును తీసుకొస్తానని హామీ ఇచ్చి గెలిచిన అర్వింద్... ఐదేళ్ళు కాలక్షేపం చేశారని కాంగ్రెస్, బీఆర్ఎస్ విమర్శిస్తున్నాయి.
బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీ, కేసీఆర్ (KCR) కూతురు కవిత నిజామాబాద్ (Nizhnamabad) ఎంపీగా పోటీ చేయట్లేదా ? ధర్మపురిని అరవింద్ (Dharmapuri Arvind) ని ఓడించి తీరుతానన్న ప్రతిజ్ఞ గట్టున పెట్టేశారా ? పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా ... జాగృతి మీద కవిత ఎందుకు దృష్టిపెట్టారు?
ఫస్ట్ లిస్ట్‌లో డీకే అరుణ (DK Aruna) కు భారీ షాక్ తగిలింది. ఫస్ట్ లిస్ట్ ప్రకటనలో తన పేరు ఉంటుందని భావించిన డీకే అరుణకు.. ఊహించని పరిణామం ఎదురైంది. మహబూబ్‌నగర్ ఎంపీ టికెట్‌పై తనకే వస్తుందని ఆమె భారీ ఆశలు పెట్టుకున్నారు.
తెలంగాణ(Telangana)లో లోక్ సభ ఎన్నికలకు బీజేపీ (BJP) అభ్యర్థుల జాబితా రెడీ అయింది. ఈ నెల 24న జరిగే కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ తర్వాత పేర్లను ప్రకటించే అవకాశముంది. తెలంగాణలో మొత్తం 17 స్థానాలు ఉండగా... 10 సీట్లకు అభ్యర్థులను బీజేపీ హైకమాండ్ ప్రకటిస్తుందని చెబుతున్నారు.
లీడర్లలో కొందరు ఎప్పుడూ డిఫరెంట్. వీళ్లు డోంట్ కేర్ లీడర్లు అన్నమాట. నిజామాబాద్ ఎంపీ అరవింద్ కూడా అంతే. ఎవడు ఏమనుకున్నా నాపని నాదే అనుకుంటాడాయన. నిజామాబాదులో అసమ్మతి బ్యాచ్ ఆయనకు ఎర్త్ పెట్టాలని ఇప్పటికే అన్ని అస్త్రాలు రెడీ చేసింది. అసలు సీట్ కూడా అనౌన్స్ చేయలేదు. అయినా సరే.... పోండె హే నాకు అనౌన్స్మెంట్లు... గీనౌన్స్మెంట్లతో సంబంధం లేదు... అంటూ ప్రచారం స్టార్ట్ చేశారు అరవింద్.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డిలో పోటీ చేశారు. అటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా కొడంగల్‌తో పాటు కామారెడ్డి బరిలో దిగారు. అయితే, ఓటర్లు మళ్లీ బై పోల్‌కు ఛాన్స్ లేకుండా కామారెడ్డిలో కేసీఆర్, రేవంత్‌ను కాదని బీజేపీ అభ్యర్థి వెంకటరమణరెడ్డిని గెలిపించారు.
ధర్మపురి అరవింద్ ప్రస్తుతం బీజేపీ నుంచి నిజామాబాద్ ఎంపీగా కొనసాగుతున్నారు. గతంలో బండి సంజయ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో మొదలైన దుమారం ప్రెస్ మీట్లు పెట్టి ఒకరిని ఒకరు వివరణ ఇచ్చుకునే స్థాయికి పోయింది. దీనిపై అధిష్టానం సీరియస్ అయినట్లు సమాచారం.
బీజేపీలో పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయ్. ఒకప్పటి కాంగ్రెస్‌లా కనిపిస్తోంది ఇప్పుడు కమలం పార్టీ. నేతలే కాదు.. చివరికి కార్యకర్తలు కూడా ఒకరి మీద ఒకరు కత్తులు దూసుకుంటున్న పరిస్థితి. అధ్యక్ష మార్పు జరిగినా.. పార్టీలో పరిస్థితులు సద్దుమణగడం లేదు.
అర్వింద్‌కు సోషల్ మీడియా బాధ్యతల్ని అప్పగించాలని కిషన్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. అర్వింద్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ట్విట్టర్ ద్వారా కేటీఆర్, కేసీఆర్, కవిత సహా బీఆర్ఎస్పై ఘాటైన విమర్శలు చేస్తుంటారు.