Home » Tag » Diesel
పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గబోతున్నాయనే వార్తపై.. కొద్దిరోజులుగా తెగ ప్రచారం జరుగుతోంది. పెట్రోల్ బంక్‌లు కూడా ఎక్కువ నిల్వలు పెట్టుకోవడం లేదని.. ఏ క్షణం అయినా రేట్ల తగ్గింపుపై ప్రకటన వెలువడుతుందనే రూమర్లు క్రియేట్ చేసిన హల్చల్ అంతా ఇంతా కాదు. అసలే ఇది ఎన్నికల సమయం కావడంతో.. ఈ ప్రచారం మరింత బలంగా వినిపించింది. ఎన్నికలు వస్తున్నాయంటే ఏ పార్టీ మేనిఫెస్టోలో అయినా సరే.. గ్యాస్ రేట్లు తగ్గిస్తామనే హామీ కామన్‌గా కనిపిస్తుంది.
గ్యాస్ ధర తగ్గింది.. మరి నెక్స్ట్ ఏంటి..? ఐదు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఎవరూ ఊహించని విధంగా బండ బాదుడును తగ్గించింది కేంద్రం. మరి తర్వాత స్టెప్ గా పెట్రోల్ ధరలు తగ్గిస్తుందా..? నిజంగా కేంద్రంలో ఆ ఆలోచన ఉందా..? ఉంటే పెట్రోల్ ఎంత మేర తగ్గొచ్చు..?
దేశంలోనే పెట్రోల్ ధర ఎక్కువగా ఉన్న మొదటి రాష్ట్రం ఏపీ. తెలంగాణ మూడో స్థానంలో ఉంది. కేరళ రెండో స్థానంలో ఉంది. డీజిల్ ధరల్లో లక్షద్వీప్ మొదటి స్థానంలో ఉండగా, ఏపీ రెండో స్థానంలో ఉంది. కేరళ మూడో స్థానంలో, తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది.
ఈ రోజుల్లో బండి బయటికి తీయడమే పాపమైపోయింది. ఎందుకంటే పెట్రోల్ రేటు లీటర్‌కే 110 రూపాయలు ఉంది. ఇక ఫ్రెండో రిలేటివో బైక్ అడిగితే.. ఇవ్వను అని చెప్పలేక పెట్రోల్ కోసం ఆరాటపడలేక మధ్య తరగతి ప్రజలు పడే పాట్లు అన్నీ ఇన్నీ కాదు.
గత కొన్నినెలలుగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగకపోవడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. వాస్తవానికి అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తక్కువగా ఉన్నా పెట్రోలియం కంపెనీలు మాత్రం ధరలు తగ్గించలేదు.