Home » Tag » Digital Media
తెలుగు మీడియా గురించి ఐడియా ఉన్న ప్రతీ ఒక్కరికి తెలిసిన పేరు రవిప్రకాశ్. టీవీ 9లాంటి సంస్థతో తెలుగునాట సంచలనాలు క్రియేట్ చేశాడు. టీవీ9 ఏళ్లకు ఏళ్లు నంబర్ వన్ స్థానంలో ఉందంటే.. అదంతా రవిప్రకాశ్ కష్టమే ! ఐతే ఆ తర్వాత ఆ సంస్థ చేతులు మారడం.. రవిప్రకాశ్‌ను గెంటేయడం జరిగింది. షేర్లు, కేసులు.. లోగోల అమ్మకాలు అంటూ రకరకాల కేసులు రవిప్రకాశ్ చుట్టూ తిరిగాయ్ ఆ మధ్య ! దీంతో మీడియాకు దూరంగా ఉన్నట్లు కనిపించారు.
ఒకప్పుడు సినిమా థియేటర్లోకి వెళ్లి చూడాలంటే రూ.200 ఉంటే సరిపోయేది. కుటుంబంలోని నలుగురు సభ్యులు కలిసి వినోదాన్ని ఆస్వాధించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఏదైనా చిత్రాన్ని కుటుంబ సమేతంగా వెళ్లి తెరపై చూడాలంటే వెయ్యి నుంచి రెండు వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. అంటే ఒక సామాన్య మధ్యతరగతి వాళ్ళకి ఈ డబ్బుతో నెలలో ఒకవారం తిండి జరిగిపోతుందన్నమాట. అలాంటి వినోదం ఇప్పుడు అరగంట పాటూ ఒక్క రూపాయికే అందిస్తే చాలా ఆనందంగా వెళ్లి చూసేస్తారు. అందుకే ఒక్క రూపాయికే వినోదాన్ని అందించేందుకు పివిఆర్ సంస్థ నడుం బిగించింది.