Home » Tag » DK Aruna
తెలంగాణలో మహబూబ్‌నగర్ పార్లమెంట్లో ట్రయాంగిల్ ఫైట్ ఆసక్తి రేపుతోంది. మరి ఇందులో విజేతలు ఎవరు.. అసెంబ్లీ ఎన్నికల్లో పాలమూరును క్లీన్‌స్వీప్ చేసిన కాంగ్రెస్ గెలుస్తుందా..
సొంత గడ్డ మహబూబ్‌నగర్‌లో డీకే అరుణకు షాక్ తప్పదా ? ఇప్పటి వరకూ పొలిటికల్ జేజమ్మగా పేరు తెచ్చుకున్న డీకే అరుణ ఇక పాలమూరు నుంచి పాగా పీకాల్సిందేనా? మహబూబ్‌నగర్‌లో ప్రస్తుతం కనిపిస్తున్న సీన్ చూస్తే ఇదే నిజమయ్యేలా కనిపిస్తోంది.
హైదరాబాద్ (Hyderabad) లోక్‌సభ స్థానంలో ఒవైసీని సవాల్ చేస్తున్న మాధవీలత.. ప్రచారంలో దూసుకుపోతోంది.
తెలంగాణ నుంచి తొమ్మిది స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించగా.. ఇప్పుడు మరో ఆరుగురికి చోటు దక్కింది. దీంతో ఇప్పటివరకు తెలంగాణ నుంచి మొత్తం 15 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఖమ్మం, వరంగల్ స్థానాలను బీజేపీ పెండింగ్‌లో పెట్టింది.
ఫస్ట్ లిస్ట్‌లో డీకే అరుణ (DK Aruna) కు భారీ షాక్ తగిలింది. ఫస్ట్ లిస్ట్ ప్రకటనలో తన పేరు ఉంటుందని భావించిన డీకే అరుణకు.. ఊహించని పరిణామం ఎదురైంది. మహబూబ్‌నగర్ ఎంపీ టికెట్‌పై తనకే వస్తుందని ఆమె భారీ ఆశలు పెట్టుకున్నారు.
లోక్‌సభ అభ్యర్థుల (Lok Sabha Elections)ఎంపిక కోసం ముమ్మర కసరత్తు చేస్తోంది తెలంగాణ బీజేపీ. షెడ్యూల్ విడుదలకన్నా ముందే అభ్యర్థులను ప్రకటించాలన్న టార్గెట్‌తో ఉంది అధినాయకత్వం. తెలంగాణలో ఈసారి డబుల్ డిజిట్ కొట్టి తీరాలన్న కసితో ఉన్న కమల నాథులు ఆ క్రమంలో ఎక్కడా తేడా రాకుండా జాగ్రత్త పడుతున్నట్టు తెలిసింది. ఢిల్లీలో భేటీ అయిన తెలంగాణ బీజేపీ ఎన్నికల కమిటీ... మొత్తం 17 స్థానాల అభ్యర్థుల గురించి చర్చించినట్టు తెలిసింది.
గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని స్పష్టం చేశారు. అధిష్టానానికి డీకే అరుణ తన నిర్ణయాన్ని తేల్చి చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. ఈ పరిణామంతో గద్వాలలో బిజెపి నుంచి ఎవరు బరిలోకి దిగబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది.
బీజేపీ పార్టీ అభ్యర్థిగా డీకే అరుణ ఉండదని తెలియడంతో బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు తీవ్రంగా కలతచెందుతున్నారు.
2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో డీకే అరుణ కాంగ్రెస్ నుంచి, గద్వాల అసెంబ్లీకి పోటీ చేశారు. ఆమెపై బీఆర్ఎస్ అభ్యర్థి కృష్ణ మోహన్ రెడ్డి గెలుపొందారు.
ఎన్నికల సమయంలో తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారనే అభియోగంలో కృష్ణమోషన్ రెడ్డి ఎన్నికను రద్దు చేసింది తెలంగాణ హైకోర్టు. ఆయన తరువాత స్థానంలో ఉన్న డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించింది.