Home » Tag » Drone Attack
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇంటి పై డ్రోన్ దాడి సంచలనం అయింది. ఆ సమయంలో ప్రధాని నెతన్యాహు దంపతులు ఇంట్లో లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం (Ukraine vs Russia War) గత రెండు సంవత్సరాలుగు కొనసాగుతుంది. ఫిబ్రవరి 24 సమారు 3 గంటల సమయ్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) తూర్పు ఉక్రెయిన్ (Ukraine) లో అధికారికంగా సైనిక చర్యను ప్రకటించారు.
తన వరకు వస్తే గానీ నొప్పి తెలియదంటారు.. ! నిజమే.. బుల్లెట్ దించే వాడికంటే.. బుల్లెట్ దిగిన వాడికే పెయిన్ తెలుస్తుంది..వ్యక్తుల మధ్య వైరమైనా.. దేశాల మధ్య యుద్ధమైనా అంతే..! ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్నే తీసుకుందాం..! వారం పదిరోజులు అనుకున్న యుద్ధం కాస్తా.. 463 రోజులకు చేరుకుంది. ప్రతి రోజూ ఉక్రెయిన్ పై రష్యా ఏదో రూపంలో దాడి చేస్తూనే ఉంది. ఒకరకంగా ఉక్రెయిన్ ప్రజలకు బాంబుల మోతతోనే సూర్యోదయం, సూర్యాస్తమయం అవుతున్నాయని చెప్పాలి. నెలల తరబడి సాగుతున్న యుద్ధానికి ఉక్రెయిన్ ప్రజలు కూడా అలవాటు పడిపోయారు. లక్షలాది మంది జీవితాలు సర్వనాశనమైనా.. వేలాది మంది ప్రాణాలు కోల్పోయినా.. నగరాలకు నగరాలు రూపు రేఖలు మారిపోయినా.. రష్యా ఉక్రెయిన్‌పై బాంబు వర్షం కురిపిస్తూనే ఉంది.
ప్రపంచంలోనే శక్తివంతమైన ఆర్మీ ఉన్న దేశం రష్యా. వరల్డ్‌లోనే మోస్ట్ పవర్ఫుల్ లీడర్ పుతిన్. అలాంటి వ్యక్తిపై డ్రోన్ దాడి జరిగింది. అది కూడా ఏకంగా రష్యా ప్రెసిడెన్షియల్ హౌజ్ క్రెమ్లిన్ మీద. రాడార్లకు చిక్కకుండా క్రెమ్లిన్ మీదకు దూసుకువచ్చిన రెండు డ్రోన్స్‌ను అక్కడి సెక్యూరిటీ సిస్టమ్ కూల్చేసింది. ఈ డ్రోన్ ఎటాక్ దృష్యాలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. దాడి జరిగిన వెంటనే రష్యా ఫారెన్ ఎఫైర్స్ మినిస్ట్రీ ప్రెస్‌నోట్ రిలీజ్ చేసింది. పుతిన్‌ను చంపేందుకు యుక్రెయిన్ ఈ ఎటాక్ చేసిందని చెప్పింది. దీనికి ఖచ్చితంగా పర్యావసానాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చింది.
ఇప్పటికే ప్రజాభిప్రాయం పేరుతో ఉక్రెయిన్ లోని కొంత భాగాన్ని తమ దేశంలో కలిపేసుకున్న రష్యా.. ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్తుందన్నది అంతుపట్టడం లేదు. రెండు దేశాల మధ్య యుద్ధం మళ్లీ తీవ్ర స్థాయిలోకి వెళితే.. ప్రపంచం మరో సంక్షోభాన్ని చూడాల్సి వస్తుంది.