Home » Tag » Dubbaka
అచ్చు రాజరికం పోకడలు... దొరల పెత్తనం సాగాలి... నాకు ఎవరూ ఎదురు మాట్లాడొద్దు. నేను చెప్పిందే వినాలి... ఎవరైనా ఎదురు మాట్లాడారో... వాటి మీద నిఘా పెట్టాలి...
రఘునందన్ రావు, ఈటల రాజేందర్.. తెలంగాణ బీజేపీలో కీలక నేతలే. ఇద్దరూ ఈ సారి ఉమ్మడి మెదక్ జిల్లాలోని దుబ్బాక, గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ తమకు బీజేపీ ఎంపీ టిక్కెట్ ఇవ్వాలని అధిష్టానాన్ని పట్టుబడుతున్నారు.
కొత్త ప్రభాకర్ రెడ్డి పేరులోనే కొత్త ఉంది తప్ప.. ఆయన పాతచింతకాయ పచ్చడే. దొర గడీలో కాపలా ఉండే ప్రభాకర్.. ఎందుకు దుబ్బాకను రెవెన్యూ డివిజన్ చేయలేదు..? ఎందుకు దుబ్బాకకు నిధులు తెప్పించలేదు..? ఎందుకు ఈ దుబ్బాకకు పీజీ కాలేజీ తీసుకురాలేదు..?
బీఆర్ఎస్ దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పై జరిగిన హత్యాయత్నాన్ని సీఎం కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో భౌతికదాడులకు ఆస్కారం లేదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ప్రజా తీర్పు ను ఎదుర్కోలేక భౌతిక దాడులకు, హత్యా రాజకీయాలకు తెగబడడం సిగ్గుచేటని సీఎం అన్నారు.
రఘునందన్ రావును గెలుపు వరించడంతో దుబ్బాక కాషాయ కోటగా మారింది. ఇప్పుడు ఇదే నియోజకవర్గం నుంచి సోలిపేట రామలింగారెడ్డి కుమారుడు సోలిపేట సతీష్ టికెట్ ఆశిస్తున్నారు. మరోవైపు సిద్దిపేట ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా దుబ్బాకలో యాక్టివ్‌గా ముందుకు సాగుతున్నారు.
రఘునందన్ రావు కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
దుబ్బాకలో ఓ వర్గం ఎప్పటి నుంచో రఘునందన్ రావును వ్యతిరేకిస్తోంది. మొదటి నుంచి బీజేపీలో ఉన్న నేతలు రఘునందన్ రావును అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈసారి రఘునందన్ రావుకు దుబ్బాక టికెట్ ఇవ్వొద్దని హెచ్చరిస్తున్నారు.
పదేళ్ల నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నా. నాకు తగిన పదవి కావాలి. తెలంగాణ అధ్యక్ష పదవి.. అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ పదవి.. జాతీయ అధికార ప్రతినిధి పదవి.. ఈ మూడింటిలో ఏదో ఒకటి ఇవ్వాలని కోరుతున్నా. నేను అధ్యక్ష పదవికి ఎందుకు అర్హుడిని కాను.
ఒకప్పటి కాంగ్రెస్‌లా తయారయింది ఇప్పుడు తెలంగాణలో బీజేపీ పరిస్థితి. పార్టీ అధ్యక్షుడి తిట్టే వాళ్లు ఒకరు.. పార్టీలో మార్పులు కావాలి అంటూ పోస్టులు పెట్టేవాళ్లు ఇంకొకరు.. అసంతృప్తితో అలకపాన్పు ఎక్కేవాళ్లు మరొకరు.
బీఆర్ఎస్కు కొరకరాని కొయ్యలా మారిన లీడర్లు ఎవరు అని లిస్ట్ తీస్తే.. రఘనందన్ పేరు టాప్‌లో ఉంటుంది. రాజకీయాల్లో ఎవరైనా మాటలతో కొడతారు.. రఘునందన్ మాత్రం లాజిక్కులతో కొడతారు. పక్కా లెక్కలు చూపించి మరీ.. ప్రభుత్వాన్ని నిలదీస్తుంటారు. 2020లో జరిగన ఉపఎన్నికలో దుబ్బాక నుంచి మొదటిసారి గెలిచిన రఘునందన్.. వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.