Home » Tag » ECI
రెండో దశలో కర్ణాటకలోని 28 స్థానాలకుగాను 14, రాజస్థాన్‌లోని 13, మహారాష్ట్రలో 8, ఉత్తరప్రదేశ్‌లో 8, మధ్యప్రదేశ్‌లో 7, అసోంలో 5, బీహార్‌లో 5, ఛత్తీస్‌గఢ్‌లో 3, పశ్చిమబెంగాల్లో 3, మణిపూర్, త్రిపుర, జమ్మూకశ్మీర్‌లలో ఒక్కో స్థానంలో ఎన్నికలు జరగనున్నాయి.
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీ ఆంజనేయులు, విజయవాడ నగర సీపీ కాంతి రాణాపై ఈసీ బదిలీ వేటు వేసింది. ఎన్నికలతో సంబంధంలేని విధులు అప్పగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
గడిచిన 45 రోజుల్లోనే దేశవ్యాప్తంగా రూ.4,658 కోట్ల విలువైన సొమ్మును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంటే.. సగటున రోజుకు రూ.100 కోట్లకుపైగా సొమ్ము దొరికింది. అయితే, ఇది పూర్తిగా నగదు కాదు. ఇందులో నగదు డబ్బు రూ.395.39 కోట్లు మాత్రమే.
వచ్చే నెల 3 నుంచి మూడు రోజులపాటు రాజీవ్ కుమార్‌తో పాటు కేంద్ర ఈసీ బృందం తెలంగాణలో పర్యటించనుంది. అదే రోజు జాతీయ పార్టీలు, గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీలతో ఎన్నికల సంఘం భేటీ అవుతుంది. అక్టోబర్ 4న జిల్లాల కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలతో సమావేశం నిర్వహిస్తుంది.