Home » Tag » Economy
పాకిస్థాన్ (Pakista) సంతతికి చెందిన 51 ఏండ్ల బ్రిటిష్ (British) పౌరుడు సాధిక్ ఖాన్ వరుసగా మూడోసారి లండన్ మేయర్‌గా ఎన్నికయ్యి హాట్రిక్ విజయం సాధించారు. లేబర్ పార్టీ (Labor Party) తరఫున పోటీ చేసి తన ప్రత్యర్థి సుసన్ హాల్‌పై ఆయన భారీ విజయం సాధించారు.
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 19వ వర్ధంతి వేళ హైదరాబాద్‌లోని 'పీవీ జ్ఞానభూమి' వద్ద రాష్ట్ర గవర్నర్ తమిళిసై నివాళులు అర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మంత్రులు, పీవీ కుటుంబ సభ్యులు, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కాంగ్రెస్ నేతలు పీవీకి అంజలి ఘటించారు. పీవీ నరసింహారావుకు నివాళి అర్పించిన రేవంత్ రెడ్డి. అనంతరం పీవీని గుర్తు చేసుకున్నారు రేవంత్ రెడ్డి.
కెనడాకు చెందిన ఖలిస్థానీ నాయకుడు హరదీప్ సింగ్ హత్యపై భారత్ హస్తం ఉందని ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలు మనకు తెలిసిందే. దీంతో భారత్ ఆ దేశంతో దౌత్యం తెంచుకుంది. తద్వారా ఎగుమతులు, దిగుమతులు మొదలు మనోళ్లు అక్కడకు వెళ్లేందుకు వీసాలు కూడా నిలిపివేయబడ్డాయి. దీంతో కెనడా ఆర్థిక వ్యవస్థకు తీవ్ర ఇబ్బందిగా మారే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.
20141లో బీజేపీ అధికారం చేపట్టేటప్పటికీ ఇండియా పదో ఆర్థిక శక్తిగా ఉండేది. మేం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో ఇండియా ఇప్పుడు ఐదో ఆర్థిక శక్తిగా ఎదిగింది. కేంద్రంలో మూడోసారి కూడా మేమే అధికారం చేపడతాం. మూడోసారి మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇండియా మూడో ఆర్థిక శక్తిగా ఎదుగుతుంది.
ప్రభుత్వ అప్పు పరిమితి పెంచకుంటే జూన్ నెల నుంచి ప్రభుత్వ చెల్లింపులు ఆగిపోతాయని అమెరికా ఆర్థిక మంత్రి యెలెన్ స్వయంగా చెప్పారంటే అక్కడి పరిస్థితి ఎలా ఉందో అంచనా వేయొచ్చు. ఇప్పటికే అమెరికా అప్పు గరిష్ట స్థాయికి చేరుకోగా, అప్పు పరిమితిని పెంచాలని జో బైడెన్ (డెమొక్రటిక్) ప్రభుత్వం కోరుతోంది.