Home » Tag » ED Enquiry
క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ షాకిచ్చింది. ఈ నెల 15 మరోసారి విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేసింది. క్యాసినో నిర్వహణలో ఫెమా నిబంధనలు ఉల్లఘించారనే అభియోగంతో ప్రవీణ్‌పై కేసు నమోదు చేసింది ఈడీ. ఈ కేసులో ఇప్పటికే పలుమార్లు ప్రవీణ్‌ను విచారించారు ఈడీ అధికారులు. రీసెంట్గా బ్యాంకాక్‌లో ప్రవీణ్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు మరోసారి ప్రవీణ్‌కు ఈడీ నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది.
ఢిల్లీ నుంచి గల్లీ వరకు లిక్కర్ స్కామ్ రేపుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు రావడంతో.. మరింత చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి కేసు భారీ ట్విస్ట్ కనిపించింది. సుఖేష్ చంధ్రశేఖర్ అనే ఖైదీ.. బాంబ్ పేల్చాడు. ఇప్పటికే 2వందల కోట్ల హవాలా కేసులో అరెస్ట్ అయి.. తీహార్ జైల్లో ఉన్న సుఖేష్.. బీఆర్ఎస్, ఆప్ పార్టీలపై పెద్ద బాంబ్ పేల్చాడు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో భాగంగా 75కోట్ల గుట్టు విప్పేశాడు. ఇదంతా బీఆర్ఎస్ ఆఫీసులోనే జరిగిందంటూ కొన్ని విషయాలు బయటపెట్టాడు.
కవిత ఢిల్లీ లిక్కర్ స్కాం లో విచారణ ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆమె భర్త అనిల్ స్క్రీన్ పైకి వచ్చారు.
భర్తంటే భరించేవాడే కాదు. ప్రతీ కష్టంలో పక్కన నిలబడేవాడు. నేనున్నా అంటూ ధైర్యం ఇచ్చేవాడు. జీవిత భాగస్వామి కోసం పోరాటానికి కూడా సిద్ధమయ్యేవాడు. ఇవే మాటలకు శాంపిల్‌గా మారారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో మూడోసారి విచారణకు హజరయ్యారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. 10ఫోన్లు ధ్వసం చేశారన్న ఆరోపణలకు కౌంటర్ ఇచ్చేందుకు... తాను వాడిన అన్ని ఫోన్లను తీసుకుని ఈడీ ఆఫీస్‌కు వచ్చారు. ఈ నెల 11న మొదటిసారి లిక్కర్ స్కాం కేసులో అధికారులు కవితను విచారించారు.
20 న కూడా ఈడీ విచారణకు వెళ్లకూడదనే ఆలోచనలో కవిత ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో KTR, కవిత మధ్య వాదోపవాదాలు జరిగాయని సమాచారం. ఈడీ విచారణను ఎదుర్కొవడమే మంచిదని... తెగే వరకు లాగొద్దని KTR ఇచ్చిన సూచనను కవిత కొట్టిపడేసారట.
ఈడీ అంచనాలు నిజం అయితే.. నిజంగా నిజాలు బయటకు వస్తే.. లిక్కర్ స్కామ్ ఉచ్చు కవిత చుట్టు మరింత బిగుసుకునే అవకాశం ఉంది. ఆ ఫోన్లో ఏముంది.. ఆ ఫోన్ ఎక్కడుందనే చర్చ ఇప్పుడు రాజకీయవర్గాలతో పాటు జనాల్లోనూ వినిపిస్తోంది.
కవిత ఒక్క మాట మాట్లాడకుండా విచారణ ఎదుర్కుని ఉంటే సానుభూతి వచ్చేది. అది వదిలేసి ఈ పిల్లి మొగ్గలు వేయడం చూసి...అసలు నిజంగానే కవిత ఏదో చేసి ఉంటుంది లేక పోతే కేస్ ఎందుకు పెడతారు అని జనం మాట్లాడు కుంటున్నారు.
లిక్కర్ కేసులో ముగిసిన మొదటిరోజు ఈడీ విచారణ
ఇప్పుడు కవితను విడిచి పెట్టినంత మాత్రాన ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చినట్టేనా..? ఇక కవితను అరెస్ట్ చేయరా..? అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి.