Home » Tag » Election 2024
టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరూ అనే దానిపై చర్చ జరుగుతోంది.
బీజేపీలోకి ఆశావాహులను గాలం వేసేందుకు సిద్దమైంది బీజేపీ.
సాధారణంగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత గానీ బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగదు. నామినేషన్లు సమర్పించడానికి మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉందనగా బీజేపీ సీఈసీ భేటీ జరుగుతుంది. ఏ నియోజకవర్గం నుంచి ఎవరు బరిలోకి దిగుతారో కూడా ఈ సమావేశంలో నిర్ణయిస్తారు.
జనసేనాని పవన్ కల్యాణ్ వారాహి విజయోత్సవ యాత్ర ఉత్తరాంధ్రలో అడుగు పెట్టకముందే రాజకీయ వేడి రగిలింది. పవన్ను అడ్డుకోవడానికి అధికార వైసీపీ పోలీసులను అడ్డుపెట్టుకుంటోంది. మమ్మల్ని ఎలా అడ్డుకుంటారో చూస్తామంటూ జనసైనికులు సవాల్ చేస్తున్నారు. దీంతో విశాఖలో ఏం జరుగుతుందోనన్న టెన్షన్ నెలకొంది.
ఎన్నికలకు సిద్ధం కావాలని మంత్రులకు సూచించారు ఏపీ సీఎం జగన్. కేబినెట్ సమావేశంలో కీలక సూచనలు చేశారు. మంత్రివర్గ సమావేశం అయిపోయిన తర్వాత.. అధికారులు వెళ్లిపోయాక రాజకీయ అంశాలపై మంత్రులతో జగన్ చర్చించారు. మరో 9 నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని చెప్పారు.
ఈటెల రాజేందర్ ప్రెస్ మీట్ లో సంచలన కామెంట్స్ చేశారు.
నేను చేయగలను అనుకోవడం ఆత్మవిశ్వాసం.. నేను మాత్రమే చేయగలను అనుకోవడం అతివిశ్వాసం. ఈ రెండింటి మధ్యే ఏపీ టీడీపీ ఊగిసలాడుతుందా అంటే.. అవును అనే సమాధానమే వినిపిస్తోంది. బయటకు ఏది కనిపిస్తుందో అది నిజం కాదు అని ఓ సామెత ఉంది. అది టీడీపీకి అర్థం అవుతుందా.. అర్థమైనా కావాలని సాహసం చేస్తున్నారా అర్థం కాని పరిస్థితి.
ఏపీ రాజకీయాలు రోజురోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయ్. ఉన్నట్లే అనిపిస్తున్నా.. ఉంటుందా లేదా అనే అనుమానం. కలిసినట్లే కనిపిస్తున్నారు.. కలుస్తారా లేదా అనే సందేహం.
ఎన్నికల వేళ.. తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయ్. ఏ నేత ఎప్పుడు జంపింగ్ జపాంగ్ అంటారో.. జెండా ఎత్తేస్తారో అర్థం కాని పరిస్థితి తెలంగాణలో ! మిగతా పార్టీల సంగతి ఎలా ఉన్నా.. బీజేపీలో మాత్రం గందరగోళంగా ఉంది సీన్ అంతా ! కొత్తవాళ్లు వస్తారో రారో తెలియదు.. పోనీ ఉన్నవాళ్లైనా ఉంటారా అంటే అదీ అర్థం కాదు అన్నట్లుగా తయారయింది కమలం పార్టీ పరిస్థితి.
తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్న ాకొద్దీ.. రాజకీయాలు వేగంగా మారుతున్నాయ్. కర్ణాటక ఫలితాల ప్రభావంతో తెలంగాణ కాంగ్రెస్లో కొత్త జోష్ కనిపిస్తోంది. కాంగ్రెస్ జోరు చూసి ఆ పార్టీలోకి వలసలు పెరిగిపోతున్నాయ్.