Home » Tag » Election Code
ఏపీలో పెన్షన్ కోసం అష్టకష్టాలు పడుతున్న వృద్ధులు, వికలాంగులు..
ఇవాళ రాష్ట్రంలో సూర్యాపేట, నల్గొండ, జనగామ, ప్రాంతాల్లో పంట నష్టాన్ని పరిశీలించేందుకు కేసీఆర్ బయల్దేరిన విషయం తెలిసిందే.. ఎర్రవల్లి ఫాంహౌస్ నుంచి బస్సులో బయల్దేరి సూర్యపేటకు వెళ్లారు.
మరి కొన్ని గంటల్లో తెలంగాణలో ఎలక్షన్ కౌంటింగ్ ప్రారంభం కాబోతోంది. మరోపక్క ఎలక్షన్ కోడ్ అమలులో ఉంది. ఇలాంటి టైంలో తెలంగాణ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేతలు. ప్రభుత్వ నిధులను కాంట్రాక్టర్లకు మళ్లించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశౄరు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మధుయాష్కీ గౌడ్ స్వయంగా ఎలక్షన్ కమిషన్ కార్యాలయానికి వెళ్లారు.
రైతు బంధు స్కీమ్ తో ఓట్లు దండుకోవాలని దురాశ, ఆత్రుత, అహంకారమే తప్ప నిజంగా రైతులకు మేలు జరగాలన్న ఉద్దేశ్యం మామా, అల్లుళ్ళకు లేదన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. రైతుబంధు నిధుల జమను కేంద్ర ఎన్నికల సంఘం నిలిపివేయడంపై ఆయన స్పందించారు.
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల కమిషన్ గట్టి షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో రైతు బంధు నిధుల పంపిణీకి రెండు రోజుల క్రితం అనమతి ఇచ్చిన ఈసీ.. ఇప్పుడు ఆ అనుమతిని వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున రైతుబంధు నిధులకు బ్రేక్ వేసినట్టు తెలిపింది. రైతుల ఖాతాల్లో నిధులు వేసేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ కు విజ్ఞప్తి చేసింది. ఇది గతం నుంచీ కొనసాగుతున్న ప్రభుత్వ పథకం కాబట్టి.. అభ్యంతరం పెట్టవద్దని కోరింది. దాంతో నిధుల విడుదలకు అనుమతి ఇచ్చింది.
కోడ్ అమలుతో రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్లడం కష్టమవుతోంది. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం లాంటి నగరాల్లో పెళ్ళిబట్టలు, బంగారం లాంటివి కొనడానికి పోలీస్ చెక్ పోస్టుల నుంచి అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడింది. దీంతో ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చేసింది. ఎక్కడికక్కడ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. భారీ మొత్తంలో నగదు, బంగారాన్ని సీజ్ చేస్తున్నారు. ఎన్నికల అధికారులు, పోలీసులు, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నారు.
సోమవారం నుంచే ఎన్నికల కోడ్, నిబంధనలు అమల్లోకి వస్తాయని ఎన్నికల సంఘం తెలిపింది. ఎన్నికల కోడ్ అమలు బాధ్యతను జిల్లా కలెక్టర్లు, నోడల్ అధికారులు తీసుకుంటారు. ఈ కోడ్ అమలులో భాగంగా అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల అమలుపై ఆంక్షలుంటాయి.
ప్రముఖ బాలీవుడ్ సినీ నిర్మాత బోనీ కపూర్‌కు చెందిన కారులో వెండి వస్తువులు దొరికాయి. కర్ణాటక, దావణగెరె పరిధిలోని ఒక టోల్ గేట్ సమీపంలో శనివారం పోలీసులు, ఎన్నికల అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో అటుగా వెళ్తున్న ఒక బీఎండబ్ల్యూ కారులో భారీగా వెండి వస్తువులు లభించాయి.