Home » Tag » Election Commission
మహారాష్ట్ర ఎన్నికల తేదీలను భారత ఎన్నికల సంఘం ఈరోజు మధ్యాహ్నం ప్రకటించింది. మహారాష్ట్రలో పోలింగ్ నవంబర్ 20న జరగనుంది. ఓట్ల లెక్కింపు మూడు రోజుల తర్వాత అంటే నవంబర్ 23న జరుగుతుంది.
ఏప్రిల్ నెలలో పింఛన్ల పంపిణీపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య పెద్ద యుద్ధమే నడిచింది. అయితే, రాబోయే మే నెలలో మాత్రం ఇలాంటి పరిస్థితి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పింఛన్ నగదును మే 1వ తేదీన బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎన్నికల కోలాహలం మొదలైంది. ఇవాళ ఎన్నికల కమిషన్ జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీ, తెలంగాణలో లోక్ సభ ఎన్నికలతో పాటు ఏపీలో అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతాయి. ఇవాళ్టి (గురువారం) నుంచి ఈ నెల 25 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది.
లోక్‌సభతోపాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేయనుంది. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల షెడ్యూల్‌ని ఈసీ ప్రకటించిన వెంటనే.. దేశవ్యాప్తంంగా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వస్తుంది.
18 ఏళ్లకు ఓటు హక్కు వస్తుంది. 18-29 ఏళ్లలోపు ఓటర్లను యువ ఓటర్లుగా పరిగణిస్తారు. ఈ ఎన్నికల్లో 21.5 కోట్ల మంది యువ ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. గతంతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. ఏ ఎన్నికల్లోనైనా యువ ఓటర్ల తీర్పు చాలా కీలకం.
రాజకీయ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్స్ (Electoral Bonds) పై సుప్రీంకోర్టు (Supreme Court) సంచలన తీర్పు చెప్పింది. ఈ బాండ్స్ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం ధర్మాసనం ప్రకటించింది. సీజేఐ (CJI) DY చంద్రచూడ్ (DY Chandrachud) ఆధ్వర్యంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు చెప్పింది. ఏకగ్రీవంగా తీర్పు చెప్పింది ఐదుగురు సభ్యుల ధర్మాసనం.
వివిధ రాష్ట్రాలు కలిపి మొత్తం 56 రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అత్యధికంగా యూపీలో 10 మంది రాజ్యసభ స్థానాలు ఖాళీ ఉన్నాయి. ఈ ఖాళీల భర్తీతోపాటు బిహార్, మహారాష్ట్రలో ఆరుగురు సభ్యులకు ఎన్నిక జరగనుంది.
ఎన్నికల సంఘం అనుమతి లేకుండా గాజుగ్లాస్‌ను జనసేన ప్రమోట్ చేసుకుందని.. ఆ గుర్తును జనసేనకు కేటాయించవద్దని లేఖలో పేర్కొన్నారు. దీంతో ఆ గుర్తు జనసేనకు దక్కుతుందా లేదా అనే విషయంలో పార్టీ నేతల్లో కూడా డైలమా ఏర్పడింది.
తెలంగాణలో పంచాయతీ ఎన్నికల్లో (Telangana Sarpanch Elections) ఇప్పట్లో జరిగేలా లేవు. ఫిబ్రవరి 1 కే ప్రస్తుతం ఉన్న సర్పంచ్ ల పదవీకాలం ముగుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ లో మరో నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు.. దాంతో పాటు దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ టైమ్ లో డూప్లికేట్, డబుల్ ఓట్ల వ్యవహారం వివాదస్పదంగా మారింది. వైసీపీ, టీడీపీ పరస్పరం ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయడంతో.. ఈసీ సీరియస్ గా స్పందించింది. డూప్లికేట్, డబుల్ ఓట్లు ఉంటే కేసులు పెడతామనీ.. అవసరమైతే జైలుకు పంపుతామని హెచ్చరించింది.