Home » Tag » Election Notification
ఎన్నికల నోటిఫికేషన్ విడుదలతో ఈనెల 18 నుంచి నామినేషన్ల పర్వం ఊపందుకోనుంది. అభ్యర్థుల ప్రచారం కూడా జోరుగా సాగుతోంది.
పఠాన్‌చెరు (Patan Cheru ) నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో మంటపెట్టింది. ఇక్కడి నుంచి నీలం మధు (Neelam Madhu) ముదిరాజ్‌ను అభ్యర్థిగా ప్రకటించడంతో.. టికెట్‌పై ఆశలు పెట్టుకున్న కాటా శ్రీనివాస్ వర్గం ఒక్కసారిగా భగ్గుమన్నారు.
ఎన్నికల నోటిఫికేషన్ (Notification) వచ్చినప్పటి నుంచి.. పటాన్చెరు నియోజకవర్గంపై జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు. కేటీఆర్ (KTR) కు సన్నిహితుడిగా పేరు ఉన్న నీలం మధు.. బీఆర్ఎస్ తరఫున ఇక్కడి నుంచి టికెట్ ఆశించారు. ఐతే నిరాశే ఎదురైంది.
రియల్ ఎస్టేట్ సంస్థలు తెలంగాణ లిక్కర్ వ్యాపారం వైపుగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది.
తెగేవరకూ లాగితే ఏమవుతుందో.. ఇప్పుడు రాజస్థాన్ కాంగ్రెస్‌లో అదే జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రయాణం చేస్తే ఇక తనకు రాజకీయ భవిష్యత్తు ఉండదని.. సచిన్ పైలెట్ ఓ నిర్ణయానికి వచ్చేశారు. ముఖ్యమంత్రి గెహ్లాట్‌తో ఉన్న రాజకీయ పంచాయితీని పరిష్కరించడంలో గానీ, తన డిమాండ్లపై సానుకూలంగా స్పందించడంలో గానీ పార్టీ హైకమాండ్ విఫలమైందని భావిస్తున్న సచిన్ పైలెట్.. ఇక తాడోపేడో తేల్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మరో ఐదారు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుబోతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ ఇచ్చేందుకు సచిన్ పైలెట్ వర్గం సిద్ధమవుతుంది. వేరు కుంపటి పెట్టుకుని కాంగ్రెస్‌తో ఢీకొట్టేందుకు సచిన్ పైలెట్ ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు.