Home » Tag » Elections 2024
ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మాజీ ముఖ్యమంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, శివరాజ్ సింగ్, రావత్, బస్వరాజ్ బొమ్మై లాంటి వారు పోటీకి దిగుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఓడిన వారికి, మరోసారి సీఎంగా అవకాశం ఇవ్వని వారిని ఎంపీలుగా నిలబెట్టంది బీజేపీ హైకమాండ్.
ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి అద్దంకి దయాకర్‌కు ఇస్తామని నిన్నటివరకూ చెప్పారు. ఆయనకు ఫోన్ చేసి నామినేషన్‌కు సిద్ధంగా ఉండాలి అని కూడా చెప్పారు పార్టీ పెద్దలు. కానీ లాస్ట్ మినట్లో హ్యాండ్ ఇచ్చారు.
పవన్ కళ్యాణ్ రానున్న ఎపీ ఎన్నికల్లో పొత్తుపై క్లారిటీ.
మధ్యలో స్లో అయినా.. బ్రేకులు పడుతున్నా.. టీడీపీతో జనసేన పొత్తు అనేది మాత్రం క్లియర్. అధికారికంగా ప్రకటన రాకపోయినా.. తెరవెనక జరగాల్సిందంతా జరిగిపోతోంది. సీట్ల పంపకాల నుంచి.. ప్రచార వ్యూహాల వరకు.. రెండు పార్టీల అధినేతలు ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతూనే ఉన్నారు.
ఎన్నికలు అంటేనే వ్యూహాలు.. ప్రతివ్యూహాలు. ఎన్నికల్లో గెలవాలంటే ఒక పార్టీ తన బలాలపై దృష్టి పెడితే సరిపోదు. ప్రత్యర్థి బలహీనతల మీదా దెబ్బకొట్టాలి. ఈ పని చేయడంలో ఏపీలో వైసీపీ అధినేత, సీఎం జగన్ దిట్ట. ప్రతిపక్ష టీడీపీకి, జనసేనకు సవాళ్లు విసురుతూ తన వ్యూహంలో చిక్కుకునేలా చేయడంలో జగన్ ముందుంటారు. ప్రతిపక్షాల్ని ఎలా దెబ్బతీయాలా అని ఆలోచిస్తుంటారు. ఇప్పుడు టీడీపీని ఓడించేందుకు సరికొత్త వ్యూహంతో ముందుకురానున్నట్లు తెలుస్తోంది.
కర్ణాటక ఎన్నికల హవా ప్రారంభమైన నేపథ్యంలో నాటు నాటు సీక్వెల్ గా మోదీ మోదీ పాట వైరల్ గా మారింది.
బీఆర్ఎస్ పార్టీ నాయకులు తోట చంద్రశేఖర్ తో ప్రత్యేక ఇంటర్వూ..
వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు మాటలతో పల్నాడు రాజకీయాలపై కొత్త చర్చ మొదలైంది. ఢీ అనే మనుషులు.. వేడి పుట్టించే పరిణామాలు.. ఫ్యాక్షన్ పాలిటిక్స్‌కు కేరాఫ్ అనిపిస్తుంటుంది పల్ననాడు. ఎప్పుడూ పగతో రగిలిపోయే ప్రత్యర్థుల వేడితో.. చలికాలంలోనూ సెగలు రేపుతుంటుందు ఇక్కడి రాజకీయం. బ్రహ్మనాయుడు, నాయకురాలు నాగమ్మ కేంద్రంగా రాజ్యం కోసం ఎన్నో కుట్రలు, కుతంత్రాలు జరిగాయ్. చరిత్రలో ప్రత్యేకంగా ఒక పేజీని లిఖించుకున్న పల్నాడు ఎప్పుడూ రాజకీయ రణరంగమే! ఇప్పటివరకు ఒక లెక్క.. ఇకపై ఒకలెక్క అనేలా ఇక్కడి రాజకీయాలు కనిపిస్తున్నాయ్. జరుగుతున్న గొడవలు.. కనిపిస్తున్న ఆందోళనలు.. వచ్చే ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయో టీజర్ చూపిస్తున్నాయ్.
మనమే అనుకోవడానికి, మనదే అనుకోవడానికి చాలా ఉంటుంది బాస్ ! మనమే అనుకున్న వాళ్లు లీడర్ అవుతారు.. మనదే అనుకున్న వాళ్లు రాజకీయ నాయకుడు అవుతారు. అటు ఇటుగా జగన్ ఇప్పుడు రెండో కోవలోకే వస్తారనే చర్చ ఏపీ రాజకీయవర్గాల్లో జరుగుతోంది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో పొత్తు కుదుర్చుకున్న నేపథ్యంలో బీజేపీ జనసేనకు దూరంగా జరిగింది.