Home » Tag » Electricity
తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ టీఎస్ఎస్పీడీసీఎల్ (TSSPDCL) కూడా అధికారికంగా వెల్లడించింది. కిరాయికి ఉండే వాళ్ళకీ ఉచిత విద్యుత్ పథకం వర్తిస్తుందని టీఎస్ఎస్పీడీసీఎల్ అధికారులు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫాం Xలో TSSPDCL అధికారులు ట్వీట్ చేశారు.
తెలంగాణలో (Telangana Government) ఇళ్ళకు ఉచిత కరెంట్ స్కీమ్ (Free Current Scheme) అమల్లోకి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt.) 6 గ్యారంటీల్లో (Six Guarantees) భాగంగా గృహజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించింది. 200 యూనిట్ల లోపు విద్యుత్ (200 Units Free Current) వాడుకునేవాళ్ళు ఇకపై కరెంట్ బిల్లు కట్టనక్కర్లేదు.
24 గంటల పవర్ ఇస్తున్నామని గొప్పలు చెప్పుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వం.. ఇప్పుడు రేవంత్ సర్కార్‌కి అడ్డంగా దొరికిపోయింది. 24 గంటల కరెంట్ ఇవ్వట్లేదని తేలింది. మరోవైపు వేల కోట్ల బాకీ ఉందని తేలింది. విద్యుత్ సంస్థలకు అసలు 81 వేల కోట్ల రూపాయలు అప్పు ఎందుకైంది..?
ఒక సమావేశంలో రేవంత్ మాట్లాడుతూ.. రైతులకు నిజానికి 24 గంటల విద్యుత్ అవసరం లేదని, విద్యుత్ సంస్థల కమీషన్ల కోసమే కేసీఆర్ ఉచిత్ విద్యుత్ ఇస్తున్నారని అన్నాడు. మూడెకరాలు ఉన్న రైతుకు 24 గంటల విద్యుత్ అవసరం ఎందుకుంటుందని, మూడు గంటలు సరిపోతుందని వ్యాఖ్యానించాడు.
మీ ఇంట్లో ఉన్న ఏసీ, వాషింగ్ మిషన్, టీవీ, కూలర్ అన్నీ ఒకేసారి ఆన్ చేశారు. అది కూడా సూర్యుడు నడినెత్తిన ఉన్న సమయంలో. సాధారణంగా అయితే ఏమవుతుంది.. కరెంటు బిల్లు తడిచి మోపెడవుతుంది. ఇంట్లో ఉన్న ఎలక్ర్టిక్ వస్తువులన్నీ ఒకేసారి వాడితే.. కరెంట్ మీటర్ గిర్రును తిరిగిపోతుంది. బిల్లు చూసి గుండె గుబేల్‌మంటుంది. అయితే భవిష్యత్తులో ఇలా జరగకపోవచ్చు. పట్టపగలు ఇన్ని ఎలక్ట్రికల్ వస్తువులను మీరు ఉపయోగించినా అప్పుడు ఖర్చయ్యే కరెంటుకు మీరు సాధారణంగా చెల్లించే దానికంటే 20 శాతం తక్కువే ఉండొచ్చు.. అవును నిజమే.. ఇకపై పవర్ బిల్ టారీఫ్‌లు సమూలంగా మారిపోబోతున్నాయ్.