Home » Tag » engineering
ఇంజనీరింగ్ కాలేజీలకు సీఎం రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇంజనీరింగ్ కాలేజీల నుండి లక్షల మంది పట్టాలు పొందుతున్నారు, కానీ వాళ్లకు బేసిక్ నాలెడ్జ్ ఉండటం లేదు అని మండిపడ్డారు.
ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయ్. కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఊహించని సంఘటనలు చోటుచేసుకుంటున్నాయ్. కాకినాడ కూటమి ఎంపీ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ (Uday Srinivas).. ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు ధృవ పత్రాలు పెట్టారని ప్రత్యర్థి పార్టీలు భగ్గుమంటున్నాయ్. సర్కిల్ వేసి మరీ హైలైట్ చేస్తున్నాయ్.
బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యే మల్లారెడ్డి (Mallareddy) పరిస్థితి ఇప్పుడు మింగ లేక... కక్కలేక అన్నట్టుగా ఉంది. అయితే కాంగ్రెస్... లేకుంటే బీజేపీ... ఎక్కడికైనా మారాల్సిందే. బీఆర్ఎస్ లోనే ఉంటే... ఈ ఐదేళ్ళల్లో తన వ్యాపార సామ్రాజ్యం కూలిపోవడం ఖాయం అని భయపడుతున్నారు.
ఐఏఎస్ కావాలని కలలు కని.. చివరి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు దామోదర రాజనర్సింహ. 34యేళ్ళుగా అందోల్ లో ప్రజా సేవ చేస్తూ మరోసారి అదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కేబినెట్ లో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. గతంలో డిప్యూటీ సీఎంగా కూడా పనిచేశారు దామోదర రాజనర్సింహ.
బతికుంటే బలుసాకు తినొచ్చని పెద్దలు చెబుతారు. ఐఐటీలు, ఐఐఎంలు, పెద్ద పెద్ద ప్యాకేజీల భ్రమల్లో బతుకుతూ విలువైన విద్యార్థి జీవితంలో తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కోవడం కంటే.. పిల్లల శక్తిసామర్థ్యాలు ఎందులో ఉన్నాయో తెలుసుకుని ఆ దిశగా వాళ్లను ప్రోత్సహించడం ఉత్తమం.