Home » Tag » ENGLAND
కరేబియన్ టూర్ లో వన్డే సిరీస్ కోల్పోయిన ఇంగ్లాండ్ టీమ్ టీ ట్వంటీల్లో మాత్రం దుమ్మురేపుతోంది. వరుసగా రెండో మ్యాచ్ లోనూ విండీస్ ను చిత్తు చేసింది.
ఇంగ్లాండ్ తో సొంతగడ్డపై జరిగిన వన్డే సిరీస్ ను వెస్టిండీస్ 2-1తో కైవసం చేసుకుంది. మూడో వన్డేలో 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్ ఘన విజయం సాధించింది.
వెస్టిండీస్ టూర్ లో ఇంగ్లాండ్ తొలి విజయాన్ని అందుకుంది. ఇంగ్లీష్ క్రికెటర్ లివింగ్ స్టోన్ సెంచరీతో దుమ్మురేపడంతో రెండో వన్డేలో 5 వికెట్ల తేడాతో విండీస్ పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ కు దిగిన విండీస్ 328 పరుగుల భారీస్కోర్ చేసింది.
ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ ఇంట్లో దొంగతనం జరిగింది. బెన్ స్టోక్స్, పాక్ పర్యటనలో ఉన్నప్పుడు ఇంగ్లాండ్‌లోనే అతని ఇంట్లో దొంగలు పడ్డారు.. స్టోక్స్ ఇంట్లోకి చొరబడిన ముసుగు దొంగలు.. విలువైన ఆభరణాలు, డబ్బు, నగలను ఎత్తుకెళ్లారు.
ప్రపంచ క్రికెట్ లో అనిశ్చితి మారుపేరు పాకిస్తాన్ జట్టే... ఎప్పుడు ఎలా ఆడుతుందో తెలీదు... ఒక్కోసారి పెద్ద జట్లకు షాకిస్తుంది... మరోసారి పసికూన చేతిలో ఓడిపోతుంది.. ఆ జట్టు ఆటే కాదు పాక్ క్రికెట్ బోర్డు, టీమ్ మేనేజ్ మెంట్.. ఇలా ప్రతీ విషయంలోనూ ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు.
బంగ్లాదేశ్ చేతిలో ఘోరపరాభవంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఎట్టకేలకు సొంతగడ్డపై సిరీస్ విజయాన్ని అందుకుంది. ఇంగ్లండ్‌తో జరిగిన మూడు టెస్ట్‌ల సిరీస్‌ను పాకిస్థాన్ 2-1తో కైవసం చేసుకుంది.
సొంతగడ్డపై వరుస పరాజయాలతో సతమతమవుతున్న పాకిస్తాన్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి పడిపోయింది. తాజాగా ఇంగ్లాండ్ పై తొలి టెస్టులో ఇన్నింగ్స్ ఓటమి చవిచూడడంతో చివరి స్థానానికి దిగజారింది.
ఫలితం తేలని మ్యాచ్ లో కూడా ఓడిపోవడం ఎలాగో పాకిస్తాన్ జట్టును చూస్తే అందరికీ తెలుస్తుంది...ఖచ్చితంగా డ్రాగా ముగుస్తుందనుకున్న మ్యాచ్ లో మేం ఓడిపోగలం అని నిరూపిస్తూ ఇంగ్లాండ్ చేతిలో ఘోరపరాజయాన్ని చవిచూసింది.
పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ అజామ్ పేలవ ఫామ్ కొనసాగుతోంది. గత ఏడాదికాలంగా సరైన ఫామ్ లో లేక సతమతమవుతున్న బాబర్ ప్రస్తుతం ఇంగ్లాండ్ తో సిరీస్ లోనూ నిరాశపరుస్తున్నాడు. ముఖ్యంగా ముల్తాన్ లాంటి ఫ్లాట్ వికెట్ పైనా ఫ్లాపయ్యాడు.
నాలుగురోజుల పాటు తొలి ఇన్నింగ్స్ లే ఆడారు... ఏకంగా 1379 పరుగులు నమోదయ్యాయి...ఈ గణాంకాలు చూస్తే చాలు పిచ్ పూర్తిగా బ్యాటింగ్ కే అనుకూలంగా ఉందని ఎవరైనా చెప్పేస్తారు. ఇక ఒకేరోజు ఆటమిగిలి ఉన్న నేపథ్యంలో మ్యాచ్ డ్రాగా ముగుస్తుందనే అనుకుంటారు.