Home » Tag » Etela Rajender
గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన గజ్వేల్ ఉన్న మెదక్‌ను ఎందుకు ఎంచుకోలేకపోతున్నారు? మెదక్ వద్దు మల్కాజ్గిరి ముద్దు అని ఎందుకు అంటున్నారన్న ప్రశ్నలకు సమాధానాలు వెదికే పనిలో ఉన్నారు పరిశీలకులు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్లా పోటీ చేసి ఓడిపోయారు. సిట్టింగ్ హుజురాబాద్ స్థానంతోపాటు, కేసీఆర్‌పై గజ్వేల్ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అప్పటినుంచి ఏ పదవీ లేకుండా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రం రాకముందు.. వచ్చిన తర్వాత.. ఎన్నో యేళ్ళ పాటు మంత్రి, MLA పదవుల్లో ఉన్న సీనియర్ నేత ఈటల రాజేందర్ ఇప్పుడు ఖాళీగా ఉంటున్నారు. కేసీఆర్‌తో పడక బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి ఆయన పొలిటికల్ కెరీర్ దెబ్బతింది.
అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన 8మంది ఎమ్మెల్యేలతో పాటు.. పలువురు సీనియర్ నేతలకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. ఇంచార్జీల్లో సీనియర్లు పెద్దగా కనిపించడం లేదు. దీంతో బీజేపీ వ్యూహం ఏంటా అనే చర్చ రాజకీయవర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.
హుజురాబాద్, గజ్వేల్‌లో పోటీ చేసిన ఈటల.. రెండు చోట్లా ఓడిపోయారు. ఈ ఓటమి తర్వాత బీజేపీలో ఆయనకు ప్రాధాన్యం తగ్గిందనే ప్రచారం జరుగుతోంది. బీజేపీ అగ్రనేతల దగ్గర ఆయన పలుకుబడి బాగా తగ్గిపోయిందనే టాక్ వినిపిస్తోంది.
తెలంగాణ బీజేపీకి జోడెద్దుల్లా.. కలిసి నడవాల్సిన ఈటల రాజేందర్, బండి సంజయ్ పందెం కోళ్ళలా పోట్లాడుకుంటున్నారు. పార్టీ ఏమైపోతే మాకేంటి? మేం మాత్రం తగ్గేలేలే.. అంటున్నారు. తెలంగాణ కాషాయ పార్టీలో ఆధిపత్య పోరు ముదిరి పాకాన పడుతోంది? సాక్షాత్తు అమిత్ షా చెప్పినా.. డోంట్ కేర్ అంటున్నారు ఈటెల, బండి సంజయ్.
మోదీని ఆకాశానికెత్తిన ఈటెల రాజేందర్
పార్లమెంట్ ఎన్నికల్లో డబుల్ డిజిట్ లక్ష్యంగా పావులు కదుపుతోంది. తెలంగాణ రాజకీయాలపై అమిత్ షా.. ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. పార్టీలో ఏ చిన్న తప్పు జరిగినా.. ఎవరు తప్పు చేసినా.. ఒప్పుకునేది లేదు అని తెగేసి చెప్తున్నారు.
ఈ ఎన్నికల్లో హుజురాబాద్‌తో పాటు గజ్వేల్‌లోనూ ఈటల పోటీ చేశారు. రెండుచోట్లా ఆయనకు ఓటమే ఎదురైంది. గజ్వేల్‌లో రెండో స్థానంలో నిలవగా.. హుజురాబాద్‌లో మూడో స్థానానికి పడిపోయిన పరిస్థితి. ఇంత ఘోర పరాభవాన్ని ఈటల వర్గమే కాదు.. జనాలు కూడా ఊహించి ఉండరు బహుశా!
కేసీఆర్‌పై తిరుగుబాటు బావుటా ఎగరేసిన ఈటల.. హుజూరాబాద్‌లో ఛాలెంజ్ చేసి బైపోల్లో గెలిచారు. కేసీఆర్‌కు టఫ్ ఫైట్ ఇచ్చే నాయకుడిగా చూశారు. బీజేపీ కూడా ఈటలకు అంతే ప్రయారిటీ ఇస్తూ వచ్చింది. ఆత్మవిశ్వాసమో.. అతివిశ్వాసమో కానీ.. ఎన్నికల వేళ రెండు స్థానాల నుంచి పోటీ చేయాలని ఈటల నిర్ణయించుకున్నారు.