Home » Tag » Excise Department
తెలంగాణ ముందు నుంచే బీర్ మార్కెట్ అని చెబుతున్నాయి ఎక్సైజ్ శాఖ లెక్కలు. హైదరాబాద్ లో ఐటీ ఇండస్ట్రీతో పాటు అన్ని రాష్ట్రాలకు చెందిన యువత ఇక్కడికి ఉద్యోగాల కోసం వస్తుండటం వారెక్కువగా బీర్ కు ఫ్రెఫరెన్సె ఇవ్వడం వంటి కారణాలు బీర్ సేల్స్ అధికంగా ఉండటానికి కారణమని చెబుతున్నారు ఎక్సైజ్ నిపుణులు. ఇక లిక్కర్ సేల్స్ రాష్ట్రంలో కాస్త తక్కువగానే ఉంటాయని చెబుతున్నారు. రాష్ట్రంలో సగటున నెలకు నలభై లక్షల కేసుల బీర్లు అమ్మకాలు జరిగితే.. ముప్పై లక్షల కేసుల లిక్కర్ సేల్స్ అమ్ముడవుతాయని అంటున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఎంతో సమయం లేదు.. ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. నవంబర్ 28 మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి నవంబర్ 30 గురువారం సాయంత్రం 5 గంటల వరకు మద్యం అమ్మకాలు నిలిపివేయనున్నారు. ఈ విషయంపై వైన్స్, బార్ల యజమానులకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ముందస్తు సమాచారం ఇచ్చింది. రాష్ట్రంలోని మద్యం దుకాణాల యజమానులను రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అప్రమత్తం చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం 2,620 మద్యం దుకాణాలుండగా.. అవన్ని కూడా మూతబడనున్నాయి.
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్నాయి.. మరో నాలుగు రోజుల్లో పోలింగ్ జరగనుంది. ఎన్నికల నేపథ్యంలో శంషాబాద్ ఎక్సైజ్ శాఖ పోలీస్ స్టేషన్ పరిధిలోని వైన్స్, బార్లు, కల్లు కంపౌండ్ లను ఈనెల 28న తేదీ సాయంత్రం 5 గంటల నుండి 30వ తేదీ పోలింగ్ ముగిసేవరకు బెల్టు షాపులు మూసివేస్తున్నట్లు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ దేవేందర్ తెలిపారు.