Home » Tag » express buses
తెలంగాణలో మహిళలకు ఉచిత ప్రయాణంతో ఆర్టీసీ దారుణంగా నష్టాల్లో కూరుకుపోతుందని అంతా అనుకున్నారు. కానీ సంక్రాంతి సీజన్ లో మునుపెన్నడూ లేనివిధంగా TS ఆర్టీసీ 340 కోట్ల రూపాయల ఆదాయం సంపాదించింది. 50 లక్షల మంది ప్రయాణీకులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేశారు. డైనమిక్ ఫేర్ సిస్టమ్ పేరుతో వసూలు చేసిన అదనపు ఛార్జీలతో ఆర్టీసికి సిరుల పంట పండింది.
తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినప్పటి నుంచి క్రేజ్ మామూలుగా లేదు. గతంలో ఆర్టీసీ బస్సుల్లో 45 శాతం ఉన్న మహిళల ఆక్యుపెన్సీ.. ఇప్పుడు 75 శాతానికి పైగా పెరిగింది. ఆర్టీసీ బస్సుల్లోని సీట్లన్నీ మహిళలే ఆక్రమిస్తుండటంతో.. టిక్కెట్లు కొనుక్కున్న మగవాళ్ళు మాకు సీట్లేవని ప్రశ్నిస్తున్నారు. ఇక ఆడాళ్ళు కూడా ఫ్రీ బస్సే కదా అని ఎక్కడి పడితే అక్కడ ఎక్స్ ప్రెస్ బస్సులు ఆపుతున్నారట. దాంతో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక ప్రకటన చేశారు.