Home » Tag » Family Politics
కాంగ్రెస్ గురించి చర్చ వచ్చిన ప్రతిసారి.. కుటుంబ రాజకీయాల ప్రస్తావన వస్తుంటుంది. తండ్రులు, కొడుకులు, మనవలకే టికెట్లు ఇప్పించుకుంటారు. నిజంగా పార్టీ కోసం కష్టపడిన వారికి నిరాశే మిగులుతుంది ఆ పార్టీలో అని.. కాంగ్రెస్ మీద ఓ చెడ్డ అభిప్రాయం ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లోనూ హస్తం పార్టీ మీద ఇలాంటి అభిప్రాయమే ఉంది. అందుకే చాన్స్ దొరికిన ప్రతీసారి.. కుటుంబ రాజకీయాలు అంటూ కాంగ్రెస్ను టార్గెట్ చేస్తుంటుంది బీజేపీ.
ఇన్నాళ్లు నందమూరి కుటుంబంపై విమర్శలు గుప్పిస్తూ వైసీపీ నేతలు పబ్బం గడుపుకుంటూ వచ్చారు. ఇప్పుడు ప్రత్యర్థులందరూ వై.ఎస్.ఫ్యామిలీని కూడా ఇదే విధంగా టార్గెట్ చేయడం ఖాయం. వీటికి వైసీపీ నేతలు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రత్యర్థుల సంగతి పక్కన పెడితే సునీత, షర్మిల సంధించే ప్రశ్నలకైనై వాళ్లు స్పందించక తప్పదు.
గృహసారధులు, కుటుంబసారధుల మధ్య యుద్ధం ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. కుటుంబాలకు కలిసే క్రమంలో రెండుపార్టీల సారధుల మధ్య పరిస్థితి ఎక్కడికి దారి తీస్తుందనే టెన్షన్ కూడా కనిపిస్తోంది.