Home » Tag » Fast Bowler
బజ్‌బాల్ అంటూ విర్రవీగిన ఇంగ్లండ్ జట్టు (England Team) కు టీమిండియా (Team India) భయాన్ని పరిచయం చేసింది. గత కొంతకాలంగా ప్రత్యర్ధి జట్టుతో సంబంధం లేకుండా సంప్రాదాయ క్రికెట్ రూపురేఖలను మార్చేసిన ఇంగ్లీష్ జట్టు.. భారత్ ముందు మాత్రం తలవంచింది. తొలి మ్యాచ్‌లో గెలుపొంది మాటలతో ఓవరాక్షన్ చేసిన ఇంగ్లాండ్ ప్రత్యర్ధి ఎవరన్నది ఇంగ్లండ్ మర్చిపోయింది.
ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్, కెప్టెన్ పాట్ కమ్మిన్స్ ఐపీఎల్ 2024 మినీ వేలంలో రికార్డ్ ధరకు అమ్ముడయ్యాడు. 2 కోట్ల కనీస ధరతో ఈ ఆసీస్ కెప్టెన్ వేలం ప్రారంభం కాగా.. సన్ రైజర్స్ హైదరాబాద్ 20.50 కోట్లు వెచ్చించి అతన్ని దక్కించుకుంది. కమిన్స్ ను ఎలాగైనా దక్కించుకోవాలనుకున్న హైదరాబాద్ సన్ రైజర్స్.. బెంగళూరు పై పోటా పోటీగా వేలం పాల్గొన్నది. కమ్మిన్స్ కోసం అసలు వెనక్కి తగ్గని సన్ రైజర్స్, ఆక్షన్ లో భారీ ధరకు సొంతం చేసుకుంది.
డిసెంబర్ 10వ తేదీ నుంచి సౌతాఫ్రికాతో టీమిండియా టీ20 సిరీస్ జరుగనుంది. అయితే, దక్షిణాఫ్రికా జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. టీమ్ ప్రధాన ఫాస్ట్ బౌలర్ లుంగి ఎంగిడి టీమిండియాతో జరిగే మొత్తం సిరీస్‌కు దూరమయ్యాడు. ఎడమ కాలు చీలమండలో గాయం కారణంగా జట్టు నుంచి లుంగి ఎంగిడి తప్పుకున్నాడు. దీంతో భారత్‌తో జరిగే టీ20 సిరీస్‌కు రెండేళ్ల తర్వాత బ్యూరాన్ హెండ్రిక్స్ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.
ఐపీఎల్ సీజన్ 17 వేలం కోసం తమ పేర్లను నమోదు చేసుకున్న స్టార్ ఆటగాళ్ల జాబితాలో ఆస్ట్రేలియా స్పీడ్ స్టార్ మిచెల్ స్టార్క్ పేరు అగ్రస్థానంలో ఉంది. ప్రపంచంలోనే అత్యుత్తమ లెఫ్టార్మ్ పేసర్లలో ఒకరిగా గుర్తింపు పొందిన స్టార్క్.. 8 ఏళ్ల తర్వాత మళ్లీ ఐపీఎల్లో సందడి చేయాలని నిర్ణయించుకున్నాడు.
డబ్లిన్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా 2 పరుగుల తేడాతో ఐర్లాండ్‌ను ఓడించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ సిరీస్‌లో జస్ప్రీత్ బుమ్రా టీమ్ ఇండియా కమాండ్ తీసుకున్నాడు.
వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌ను గెలుచుకున్న టీమిండియా ఇప్పుడు వన్డే సిరీస్‌పై కన్నేసింది. ఈ సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌లు జులై 27, 29 తేదీల్లో బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్‌లో జరగనున్నాయి.
ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ప్రదర్శనతో టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ చాలా సంతోషంగా ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫాస్ట్ బౌలర్ అక్కడి పిచ్‌పై ప్రత్యర్థి జట్టు బ్యాట్స్మెన్ల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడు.